అది స్విట్జర్లాండ్‌లోని మాంట్ బ్లాండ్ గ్లేసియర్  ప్రాంతం.. అంతర్జాతీయంగా ప్రాముఖ్యత ఉన్న జనీవా ప్రాంతానికి సమీపంలోని ప్రాంతం.. ఆ మంచుకొండల్లో ఓ కేఫ్ ఉంది.. దాని యజమాని తిమోతీ మాటిన్.. ఆయన ఇటీవల ఆ మంచు కొండల్లో తిరుగుతుండగా ఓ పాత పేపర్ల కట్ట ఒకటి దొరికింది. ఏదో చూద్దామని పరిశీలిస్తే అవి 1966 నాటి  పత్రికలు.. అబ్బో అంటే దాదాపు 54 ఏళ్ల కిందవన్నమాట. 

 

ఆనాటి విశేషాలు చూద్దామని పరిశీలించిన తిమోతీకి.. అవి స్విట్జర్లాండ్‌ పేపర్లలా కనిపించలేదు. ద హిందు, నేషనల్ హెరాల్డ్ అనే పత్రికల పేర్లు చూసి అవి ఇండియన్ పేపర్లుగా గుర్తించాడు.. మరి మన ఇండియా పేపర్లు ఎక్కడో స్విట్జర్లాండ్‌ లోని జెనీవా ప్రాంతంలోని మంచు కొండల్లో ఎలా దొరికాయ్.. అందులోనూ.. 54 ఏళ్లనాటి పేపర్లు.. చాలా షాకింగ్ గా ఉంది కదా. 

 

అందుకూ కారణం ఉంది.. సరిగ్గా 54 ఏళ్ల క్రితం.. అమెరికా నుంచి ఇండియా వస్తున్న ఓ విమానం ఆ జెనీవా ప్రాంతంలో కుప్పకూలిపోయింది. ఆనాటి ప్రమాదంలో ఏకంగా 177 మంది మరణించారు. ఆ ప్రమాదంలోనే మన దేశ అణు కార్యక్రమ పితామహుడు హోమీ బాబా కన్నుమూశారు. మన దేశ అణు కార్యక్రమానికి రాజధానిగా భావించే బార్క్.. అంటే బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ ఆయన పేరుమీదే ఏర్పాటైంది. 

 


ఇంకా ఆనాటి పేపర్లో ఏం విశేషాలు ఉన్నాయో తెలుసా.. మురార్జీ దేశాయ్ ఓడిపోయాడు.. ఇందిరాగాంధీ ఈ దేశానికి తొలి మహిళా ప్రధాని కాబోతోంది.. అనే వార్త.. ప్రధానంగా ఉంది. ది హిందూ, ది ఎకనమిక్ టైమ్స్, ది స్టేట్స్‌మన్ వంటి పత్రికలు కూడా ఈ కట్టలో ఉన్నాయి. మంచులో ఏ పదార్థం అంత త్వరగా పాడైపోదు కాబట్టి.. ఈ పత్రికలు 54 ఏళ్ల తర్వాత కూడా అంత ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి. భలే వింతగా ఉంది కదూ..! 

మరింత సమాచారం తెలుసుకోండి: