ప్రపంచంలోనే పాకిస్తాన్ దేశానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ దేశాన్ని ఏ దేశమైనా ఉగ్రవాద దేశంగానే భావిస్తుంది. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తోంది. తాజాగా పాక్ దేశానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆసియాలో పాక్ దేశం కరెన్సీ అత్యంత చెత్త కరెన్సీ అని గతేడాది వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి ఈ విషయం ధృవీకరించబడింది. బ్లూమ్ బర్గ్ అనే సంస్థకు చెందిన పోర్టల్ గతేడాది మే నెలలో కరెన్సీకి సంబంధించి కీలక సమాచారం వెల్లడించింది. 
 
బ్లూమ్ బర్గ్ అప్పట్లో పాక్ రూపాయి విలువ 20 శాతానికి పైగా పతనమై ఆసియాలోనే 13 ప్రధాన కరెన్సీలలో అత్యంత బలహీన కరెన్సీగా గుర్తింపు తెచ్చుకుందని పేర్కొంది. జంగ్ దినపత్రిక నివేదిక ప్రకారం కూడా పాక్ కరెన్సీ విలువ అప్పట్లో 29 శాతం పడిపోయింది. పాక్ కరెన్సీతో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ కరెన్సీలే స్థిరంగా ఉంటాయని ఆ పత్రిక వెల్లడించింది. అయితే పాక్ కరెన్సీని బలపరచుకోవడం కోసం పెద్దఎత్తున ప్రయత్నాలు చేసింది. 
 
అయితే ఆ ప్రయత్నాలు బెడిసికొట్టి పాక్ కరెన్సీ మారకం విలువ మరింత పతనమైంది. అయితే ఈ సంవత్సరం ఆ విలువ మరింతగా పడిపోయిందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది పాక్ కరెన్సీ విలువ పడిపోయిన తరువాత ఇమ్రాన్ ఖాన్ ఆర్థిక సలహాదారుడు హఫీజ్ షేక్ కరెన్సీ మారకం విలువను పెంచుకోవడానికి షేర్ మార్కెట్ అధికారులను సైతం కలిశారు. తరువాత కరెన్సీ మారకం విలువ పెంచేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయి. 
 
ప్రస్తుతం అక్కడ కరెన్సీ విలువ మరింతగా దిగజారుతోందని స్థిరత్వం లేని రూపాయిగా పాక్ రూపాయి పరిగణించబడుతోందని తెలుస్తోంది. అయితే పాక్ కరెన్సీ విలువను నిలబెట్టేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. పాక్ ఆర్థికవ్యవస్థను మెరుగుపరచటానికి సహకరిస్తామని చైనా చెబుతుంటే డ్రాగన్ మాత్రం కొత్త కుట్రకు తెరలేపిందని తెలుస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పాకిస్తాన్ ఆస్తులను సొంతం చేసుకునే విధంగా చైనా ప్రణాళికలను రచిస్తోందని సమాచారం. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: