జగన్ వైసీపీ అధినేత. ముఖ్యమంత్రి. బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సర్వ స్వతంత్రుడు. ఆయనకు ఆయనే హై కమాండ్. జగన్ తలచుకుంటే పదవులు అలాగే వస్తాయి. ఆయనకు కోపం వస్తే వాటంతట అవి పోతాయి కూడా. 

 

ఇవన్నీ ఇలా ఉంటే జగన్ ఈ నెల 22న మంత్రివర్గం విస్తరణ జరపబోతున్నారు. అయితే ఖాళీ అయిన రెండు సీట్లకే జగన్ మంత్రులను కొత్తగా తీసుకుంటారని అంటున్నారు. దాంతో ఆ ఇద్దరు ఎవరా అన్న ఉత్కంఠ ఓ వైపు ఉంది. అదే సమయంలో జగన్ క్యాబినెట్ లో భారీ మార్పులు చేస్తున్నారని అంటున్నారు.

 

మంత్రుల శాఖలు కూడా పూర్తిగా మారుస్తారని చెబుతున్నారు. పని చేయని వారి శాఖకు కత్తిరించి భారీ షాక్ ఇస్తారని అంటున్నారు. ఇక బాగా పనిచేసే వారికి కీలక మైన శాఖకు దక్కుతాయని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే పాతిక మంది మంత్రులలో దాదాపు పది నుంచి పదిహేను మందికి ఇపుడున్న శాఖలు కూడా  ఉండవని వినిపిస్తున్న మాట.

 

అదే విధంగా ఊ ముఖ్యమంత్రులుగా ఉన్న వారిని కూడా సాధారణ మంత్రులుగా చేస్తారని అంటున్నారు. ఇప్పటికి అయిదురుగు ఉప ముఖ్యమంత్రులలో పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా చేయగా మిగిలిన నలుగురిలో ఎవరికి ఉప ముఖ్యమంత్రి పీఠం ఉంటుందో కూడా అర్ధం కావడంలేదు.

 

అదే విధంగా కేలకమైన హోం శాఖలో కూడా కొత్తవారు వస్తారని అంటున్నారు. ఇక రెవిన్యూ వంటి అతి ముఖ్య శాఖ ఎవరికి దక్కుతుందో అన్న ఆలోచన కూడా ఉంది. ఇక జగన్ ద్రుష్టిలో ఎవరు పనిమంతులు, ఎవరు కారు అన్నది కూడా ఈ శాఖల మార్పులతో తేలిపోతుందని అంటున్నారు. 

 

ఇదిలా ఉండగా శాఖల మార్పు ఒక హెచ్చరికగా ఉండాలని జగన్ భావిస్తున్నారు. అప్పటికీ పనిచేయకపోతే ఇక ఊస్టింగేనని కూడా గట్టి సంకేతాలు ఇచ్చేలా ఈ భారీ మార్పుచేర్పులు ఉంటాయని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే జగన్ మార్క్ షాక్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందోనని మంత్రులు హడలిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: