ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వైరస్ కంట్రోల్  విషయంలో కొంత మంది రాజకీయ నాయకులు అతిగా ప్రవర్తించడం వల్ల చాలామంది సామాన్యుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ విధంగానే తెలంగాణ రాష్ట్రంలో మొదటి లో కేసిఆర్ కరోనా వైరస్ ని చాలా సింపుల్ గా తీసుకుని ఈజీగా ఎదుర్కోగలం అన్నట్టుగా మాటలు కోటలు దాటాయి. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే సామాన్యులు లబోదిబోమంటున్నారు. కరోనా వైరస్ నుండి మమ్మల్ని కేంద్ర ప్రభుత్వం గానీ గవర్నర్ గాని రక్షించాలని సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ సర్కార్ పై విమర్శలు వస్తున్నా ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు వల్ల మరింత విమర్శలు వస్తున్నాయి.

 

స్వయంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు కరోనా నిబంధనలను కనీసం పాటించకపోవడం వల్ల ఇటీవల ఆయన కరోనా బారిన పడ్డారని కామెంట్లు చేయడం జరిగింది. అయితే ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన పద్మారావు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వం బహిరంగంగా బోనాల ఉత్సవాలకు ఎక్కడా కూడా అనుమతి ఇవ్వలేదు. అయినాగాని కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి ఇంటిలోనే ఉండాల్సిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు తన నివాసం ముందుకు వచ్చిన పలహారం బండి ఊరేగింపులో పద్మారావు పాల్గొన్నారు. మళ్లీ మాస్క్ పెట్టుకోకుండా.. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఆయన బోనాల ఊరేగింపులో పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశమైంది.

 

దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో బయటపడటంతో నెటిజన్లు ఇలాంటి వాళ్ళ పై మంత్రి కేటీఆర్ వేటు వేయాలని కోరుతున్నారు. అంతేకాకుండా గతంలో కేటీఆర్ పర్యటన లో పద్మారావు కి స్వయంగా కేటీఆర్ మాస్కు ఇవ్వటం జరిగింది, కానీ పద్మారావు మాస్కు మోకానికి పెట్టుకోకుండా పాకెట్ లో దాచుకోవటం జరిగింది. దీంతో ఇంతటి నిర్లక్ష్యం వ్యక్తి కలిగిన నాయకుడిపై టిఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ వాసులు కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: