భారత్‌లో కరోనా ఉధృతి తగ్గడం లేదు. మొత్తం కేసుల సంఖ్య 9లక్షల 37వేలు దాటింది. గడచిన 24 గంటల్లో 30 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే 582 మంది చనిపోయారు. దేశంలో వైరస్ వెలుగు చూసిన తర్వాత ఈ స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవ్వడం ఇదే తొలిసారి.

 

భారత్‌లో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మన దేశంలో కొత్తగా 30 వేల 142 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. కొత్త కేసుల సంఖ్యలో ఇది సరికొత్త రికార్డు.  నెమ్మదిగా మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఒక్కరోజులోనే  582 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 24,327కు పెరిగింది.  కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 5 లక్షల  92 వేల మంది కోలుకోగా మరో 3 లక్షల 20 వేల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

 

మన దేశంలో మరణాల రేటు తక్కువే అయినా, ప్రజల్ని  భయభ్రాంతులకు గురిచేస్తూ వేగంగా విస్తరిస్తోంది కరోనా. కొత్త కేసుల నమోదులో బ్రెజిల్ ను కూడా దాటేసి భారత్ రెండో స్థానంలో నిలిచింది.  30వేల కొత్త కేసుల్ని కలుపుకొంటే భారత్ లో మొత్తం కేసుల సంఖ్య 9.37లక్షలకు పెరిగింది. వైరస్ వ్యాప్తి చెందుతోన్న వేగాన్ని బట్టి శుక్రవారంలోపే మిలియన్ మార్కును దాటే అవకాశముంది.

 

 ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 63.92శాతం, మరణాల రేటు 2.61శాతంగా ఉన్నాయి.  ఇప్పటికే దాదాపు 6లక్షల మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3.2లక్షలుగా ఉంది. అయితే కొత్త కేసులు వెల్లువలా పెరుగుతుండటం  ఆందోళనకరంగా మారింది. బిహార్ లో కొత్త కేసులు భారీగా పెరుగుతుండటం కలవరపెడుతున్నది.  అక్కడ 19వేల కేసులు, 143 మరణాలు నమోదయ్యాయి.

 

ఇప్పటిదాకా అన్ని రాష్ట్రాల్లో కలిపి కోటీ 24 లక్షల 12 వేల 664 మందికి కరోనా టెస్టులు నిర్వహించామని ఐసీఎమ్ ఆర్ తెలిపింది. మొత్తంమీద రికవరీ రేటు ఊరటనిచ్చేవిధంగా ఉన్నా.. కేసుల గణాంకాలు మాత్రం కలరవరపెడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: