తెలంగాణలో కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత వైద్యానికి రాష్ట్ర వ్యాప్తంగా 20 మెడికల్ కాలేజీలను ఎంపిక చేసింది.  అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో 17వేలకుపైగా బెడ్స్ ఏర్పాటు చేసింది.

 

తెలంగాణలో రోజురోజూకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.   నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలనుకునే వారి సంఖ్య కూడా  పెరగుతుండటంతో  ప్రైవేటు ఆస్పత్రులకు ఇప్పటికే అనుమతిలిచ్చారు. దీంతో అధిక శాతం మంది ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటుకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్వహించే కరోనా నిర్ధారణ పరీక్షలు, కరోనా చికిత్సకు వేసే బిల్లుల పట్ల తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. దీనికితోడు పాజిటివ్ కేసులు పల్లెల్లోకి పాకిపోతోంది. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చికిత్స అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు, కరోనా చికిత్స ఉచితంగా అందించేందుకు నిర్ణయించారు.

 

ప్రస్తుతం మల్లారెడ్డి, కామినేని, మమత మెడికల్ కాలేజీల్లో ఉచితంగా కరోనా చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు  వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉచిత పరీక్షలు, చికిత్సకు  సంబంధించిన పూర్తి విధివిధానాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఆ తర్వాత ఈ ఉచిత సేవలను ప్రైవేటు మెడికల్ కాలేజీలకు విస్తరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

 

మరోవైపు ప్రైవేటు ఆస్పత్రులపై  కొద్ది రోజులుగా ఫిర్యాదులు వస్తున్నాయని,  వీటి పరిష్కారం కోసం ఒక వాట్సాప్ నెంబర్ ను ఇస్తామన్నారు వైద్ఆరోగ్యశాఖ అధికారులు. బాధితులు ఆ నెంబర్‌కు ఫిర్యాదులు చేయవచ్చునని, వాటిని పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రైవేటు ఆస్పత్రులు చేస్తున్న ట్రీట్‌మెంట్‌పై పర్యవేక్షణ జరుపుతామని స్పష్టం చేశారు.

 

కరోనా ఉధృతి వేళ.. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని అరిక్టటే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కోవిడ్ పేషంట్లకు ఇది ఊరటనిచ్చే అంశమే. 

మరింత సమాచారం తెలుసుకోండి: