చంద్రబాబువి అభ్యుదయభావాలు అంటారు. ఆయన కాలం కంటే ముందుంటారని కూడా చెబుతారు. బాబు వంటి నాయకుడు మరో యాభై, వందేళ్ళ ముందుకు ఆలోచనలు చేస్తారని కూడా పేరు. అటువంటి బాబు మీద ఇపుడు ఓ అభాండం పడింది. అది అతి పెద్దదే. దాంతో ఇపుడు టీడీపీ గిలగిలా కొట్టుకుంటోంది.

 

దాని నుంచి బయటకు వచ్చేదెలా అని అవస్థ పడుతోంది. విజయనగరం గజపతుల ట్రస్ట్  గొడవల్లోకి  దిగిన చంద్రబాబు మాన్సాస్ ట్రస్ట్ బోర్డ్ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు మీద కామెంట్స్ చేశారు. గజపతుల హక్కులను జగన్ సర్కార్ కాలరాస్తోందని కూడా ఘాటుగానే అన్నారు. దీంతో ఇపుడు ఆ వ్యవహారంతో సంచయిత గజపతి రాజు గట్టి రిప్లై ఇచ్చారు. 

 

ఆడవారి పట్ల లింగ వివక్ష బాబు చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. తాను మాన్సాస్ ట్రస్ చైర్ పర్సన్ గా ఉంటే బాబుకు ఉన్న అభ్యంతరమేంటి అని కూడా ఆమె నిలదీశారు. గజపతుల గొడవల్లో బాబు జోక్యమేంటి అని కూడా ప్రశ్నించారు. మొత్తం మీద ఈ వివాదం ఇలా ఉండగానే తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత రంగంలోకి దిగి బాబుకు లింగ వివక్ష ఉందంటావా అంటూ సంచయితకు కౌంటర్ ఇవ్వడంతో ఈ గొడవ కాస్తా ఆడవారి హక్కుల మీదకు వెళ్ళిపోయింది.

 

భునవేశ్వరి, బ్రాహ్మణిలు వ్యాపారాల్లో బాగా రాణిస్తున్నారంటే దాని వెనక బాబు ఉన్నారని, అటువంటి బాబు మహిళల హక్కులను కాపాడడంతో ఎపుడూ ముందుంటారని కూడా అనిత అంటున్నారు. బాబు ఎవరి నుంచి నీతులు చెప్పించుకోవాల్సిన స్థితిలో లేరని కూడా అనిత చెప్పుకొచ్చారు. మొత్తం మీద చూసుకుంటే గజపతుల గొడవలు కాదు కానీ బాబు మహిళలకు చెడ్డ అన్నటుగా ఓ వైపు వైసీపీ పిక్చర్ ఇస్తూంటే,  బాబు కంటే మహిళా హక్కులు కాపాడేవారు ఎవరు అంటూ టీడీపీ నేతలు తగులుకుంటున్నారు. కోరి కోరి కరోనా వేళ బాబు చేసిన ఈ కామెంట్స్ తో పెద్ద అభాండమే పడిందని అంటున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: