ఏపీలో జగన్‌కు ఉన్న ప్రతిపక్షాలు ఎన్ని? అంటే అబ్బో చాలానే ఉన్నాయి అని చెప్పొచ్చు. అసలు జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, ఆయన తీసుకున్న నిర్ణయాలని సొంత పార్టీ వాళ్ళు తప్ప, మిగతా ప్రతిపక్షాల్లో ఒక్క పార్టీ కూడా సమర్ధించలేదు. ముఖ్యంగా జగన్ ఏ నిర్ణయం తీసుకున్న టీడీపీ వ్యతిరేకిస్తూనే వచ్చింది. ప్రజలకు మేలు జరిగే నిర్ణయాలు, పథకాలు అమలు చేసినా కూడా చంద్రబాబు ఏదొరకంగా విమర్శలు చేస్తూనే వచ్చారు.

 

అయితే కేవలం ఒక్క టీడీపీనే కాదు...మిగతా ప్రతిపక్షాలు కూడా జగన్‌కు వ్యతిరేకంగానే నడిచారు. జనసేన, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు సైతం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక ఎత్తు అయితే, టీడీపీకి అనుకూలంగా ఉండే మీడియా ఒక ఎత్తు అయిపోయింది. అసలు జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ అనుకూల మీడియా ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయడమే పనిగా పెట్టుకుని ముందుకెళుతుంది.

 

జగన్ తీసుకునే ప్రతి నిర్ణయంపై వ్యతిరేకంగా వార్తలు ఇచ్చింది. అలాగే పథకాల్లో కూడా ఏదొక వంక పెడుతూ వచ్చింది. ముఖ్యంగా రాష్ట్రాభివృద్ధి కోసం తీసుకున్న మూడు రాజధానులపై పెద్ద ఎత్తున విషప్రచారం చేశారు. అలాగే అమరావతి ఉద్యమాన్ని బాగా పైకి లేపడానికి చూశారు. ఇదే సమయంలో పూర్తిగా వీక్ అయిపోయిన టీడీపీకి బలం చేకూర్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

 

ఇక తాజాగా అయితే రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్ర‌మే అప్పులు చేస్తోంద‌ని, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చేస్తున్నారని తెగ ప్రచారం చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఓ రేంజ్‌లో బురద జల్లుతున్నారు. అసలు ఉన్నదాన్ని లేనట్లుగా, లేని దాని ఉన్నట్లుగా చిత్రీకరిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ టీడీపీ అనుకూల మీడియా ఎంత విష ప్రచారం చేసినా కూడా జనాల్లో జగన్‌పై అభిమానాన్ని పొగట్టలేకపోయింది. ఇంత నెగిటివ్ ప్రచారంలో కూడా జగన్ తట్టుకుని అద్భుతమైన పాలన అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: