నార్నె శ్రీనివాసరావు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు మామగా సుపరిచితుడు. అంతేగాక టీడీపీ అధినేత చంద్రబాబుకు దూరపు బంధువు కూడా. ఆ బంధుత్వంతోనే ఎన్టీఆర్‌కు నార్నె కూతురినిచ్చి పెళ్లి చేశారని సినీ, రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంటుంది. చంద్రబాబుతో ఉన్న బంధుత్వంతోనే నార్నె గతంలో టీడీపీ పార్టీలో పనిచేశారు. కానీ కొన్నేళ్లు మాత్రమే టీడీపీలో పనిచేసిన నార్నె...తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినా సరే, ఆ దరిదాపుల్లోకి కూడా రాలేదు.

 

అయితే కారణాలు ఏం ఉన్నాయో తెలియదు గానీ, నార్నె మాత్రం టీడీపీకి పూర్తిగా దూరమైపోయారు. ఇదే సమయంలో 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవాలనే ఉద్దేశంతో, పనిగట్టుకుని జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఇక ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి కోసం బాగానే కృషి చేశారు. అలాగే కుదిరితే ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని కూడా ప్రయత్నించారు.

 

ఒకానొక సమయంలో ఆయనకు చిలకలూరిపేట అసెంబ్లీ టిక్కెట్ గానీ, గుంటూరు పార్లమెంట్ సీట్ ఏదైనా దక్కొచ్చని ప్రచారం జరిగింది. కానీ ఆయనకు ఏ సీటు దక్కలేదు. కాకపోతే ఎన్నికల సమయంలో జగన్...ఆయనని పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడిగా నియమించారు. ఇక నార్నె అనుకున్నట్లుగానే ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడం జరిగింది. జగన్ అదిరిపోయే మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చేశారు. అలాగే అధికారంలోకి వచ్చాక జగన్...పదవుల పంపకాలు కూడా చేశారు.

 

ఆఖరికి నందమూరి ఫ్యామిలీకి చెందిన లక్ష్మీపార్వతికు తెలుగు అకాడమీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మామకు మాత్రం ఇంతవరకు ఏ పదవి దక్కలేదు. పైగా ఆయన జగన్ అధికారంలోకి వచ్చాకే రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండటం మానేశారు. అయితే ఫ్యామిలీ పరంగా నార్నెపై ఏమన్నా ఒత్తిడిలు వచ్చి రాజకీయాలకు దూరమయ్యారో తెలియాల్సి ఉంది. మరి చూడాలి భవిష్యత్‌లో నార్నెకు వైఎస్సార్‌సీపీలో ఏమన్నా మంచి పదవి వస్తుందో? లేక అసలు పూర్తిగా రాజకీయాలకు దూరమైపోతారో?

మరింత సమాచారం తెలుసుకోండి: