గత 70 రోజులుగా చైనా భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టాయి. అయితే భారత్ మాత్రం చైనాను నమ్మే పరిస్థితిలో లేదు. గత అనుభవాల దృష్ట్యా భారత్ చైనా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. చైనాతో చర్చల సందర్భంగా నిన్న రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒకవైపు విదేశాంగ శాఖ ప్రతినిధుల సమావేశం జరగగా మరోవైపు కార్బ్స్ కమాండర్స్ సమావేశం జరిగింది. 
 
ఈ రెండు సమావేశాల్లో చైనా గతంలో అనుసరించిన డబుల్ గేమ్ నే మరోసారి అనుసరిస్తోంది. 1962 లో చైనా భారత్ తో చేసిన యుద్ధంలో ఆక్సాచిన్ ను ఏ విధంగా కబ్జా చేసిందో ఇప్పుడు అదే తరహా విధానాన్ని ఎంచుకుంది. అమెరికా యుద్ధనౌకలను దక్షిణ చైనా సముద్రంలో మోహరించడంతో డ్రాగన్ కొంత అందోళనకు లోనైంది. భారత్ జులై 5వ తేదీని డెడ్ లైన్ గా విధించడంతో డ్రాగన్ సైన్యం వెనక్కు వెళ్లిపోయింది. 
 
1962లో మన భారత ప్రభుత్వం చైనా ఆక్సాచిన్ ను కబ్జా చేసినట్లు ప్రపంచానికి చెప్పలేదు. దీంతో చైనా ఆ ప్రాంతం తమ భూభాగమే అనే విధంగా ప్రవర్తించింది. ప్రస్తుతం గాల్వన్ లోయ దగ్గర కూడా ఇదే తరహా విధానాన్ని అనుసరించాలని చైనా భావించింది. అయితే భారత్ మాత్రం డ్రాగన్ డ్రామాలు ముందుగానే పసిగట్టి అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గాల్వన్ లోయ అంతా భారత్ దేనని నిన్న కార్బ్స్ కమాండర్స్ స్థాయి సమావేశంలో ఆధారాలతో సహా నిరూపించింది. 
 
భారత్ చైనా నుంచి గజం భూమి కూడా కోరట్లేదని అదే సమయంలో మన దేశం భూభాగాన్ని డ్రాగన్ ఆక్రమించడానికి ప్రయత్నిస్తే ఊరుకోబోమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఇరు దేశాలు పూర్తిగా వెనక్కు వెళ్లిపోవాలని ఒప్పందం కుదిరిందని ఆ దిశగా అడుగులు పడాలని భారత్ ప్రకటన చేసింది. భారత్ ఐతే చైనా భూభాగాన్ని ఆక్రమించడానికి చేసే ప్రయత్నాలకు ధీటుగా సమాధానం ఇస్తామని స్పష్టం చేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: