ఇపుడున్న సమాచారం మేరకు జగన్ మంత్రివర్గంలో ఇద్దరికే చోటు. ఆ ఇద్దరూ ఎవరు ఇదే ఇపుడు హాట్ హాట్ టాపిక్. ఇందులో కులాలు, ప్రాంతాలు, వర్గాలు ఇలా అన్ని రకాలైన  సమీకరణలు తీసుకొస్తున్నారు. కానీ ఎవరి లెక్కలు వారివీ. అవి దేనికీ సరిపోలడంలేదు. జగన్ మదిలో ఏముందో అంతకంటే తెలియడం లేదు.

 

దాంతో ఎవరికి వారు తమకే మంత్రి పదవి దక్కుతుంది అని ఊహించుకుంటున్నారు. సిక్కోలు జిల్లా పలాసాకు చెందిన డాక్టర్ సీదరి అప్పలరాజుకు మంత్రి యోగం ఉందని లేటెస్ట్ టాక్. ఆయన రాజకీయంగా దిగ్గజ కుటుంబం అయిన గౌతు శ్యామ సుందర శివాజీ కుమార్తె శిరీషను ఓడించి గెలిచారు. అంతే కాదు, వ్రుత్తి రిత్యా డాక్టర్. దాంతో జనంలో బాగా పలుకుబడి ఉంది. ఇక మత్య్స కార కుటుంబానికి చెందిన అప్పలరాజుకు ఈ దఫా చాన్స్ ఖాయమని అంటున్నారు. 

 

మోపిదేవి వెంకట రమణ స్థానం ఆయనకే ఇస్తారని కూడా అంటున్నారు. జగన్ గత ఏడాది గెలవడంతోనే అప్పలరాజు కే మంత్రి పదవి అనుకున్నారు. అయితే శాసన‌మండలిలో ఉన్న మోపిదేవిని తెచ్చి పదవి ఇవ్వడంతో నాడు డాక్టర్ గారు కొంత దిగాలు పడ్డారు. అయితే ఏడాది తిరగకుండానే ఇపుడు ఆ సీటు ఖాళీ అవడంతో ఇక డాక్టర్ గారి కోసమే ఇదంతా జరిగింది అని అంటున్నారు.

 

ఏది ఏమైనా సిక్కోలుకి ఈ విస్తరణలో ఒక ఉప ముఖ్యమంత్రి, కొత్త మంత్రి పదవి కూడా దక్కుతుందని అంటున్నారు. జిల్లాలో ధర్మాన క్రిష్ణ దాస్  కి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. అదే విధంగా అప్పలరాజుకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఈ విస్తరణలో శ్రీకాకుళం జిల్లా రాజకీయంగా బాగా లాభపడినట్లే. ఇప్పటికి ఉత్తరాంధ్రాకు నాలుగు మంత్రి పదవులు ఉన్నాయి. ఇపుడు అయిదుకు ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: