అవును మరి ఇపుడున్న పరిస్థితుల్లో చైనాను ఎవరు నమ్ముతారు. చైనా అంటేనే అదేదో గుర్తుకువస్తోంది. అసలు ఆ దేశం అన్నది ఒకటి ఉందని తెలియని వారికి కూడా ఇపుడు బాగా తెలిసిపోయింది. కరోనా వైరస్ పేరిట చైనాకు వచ్చిన చెడ్డ పేరు అంతా ఇంతా కాదు.

 

అది చాలదన్నట్లుగా సరిహద్దులోకి దిగి గిల్లి కజ్జాలు పెట్టుకుంటోంది చైనా. ఈ మధ్యనే భారత్ జవాన్లు 21 మందిని దారుణంగా హతమార్చింది. ఆ తరువాత సీన్ యుధ్ధం దాకా వెళ్ళినా కూడా డ్రాగన్ తన నక్కుజిత్తులు ఉపయోగించి రాజీ బాట పట్టింది. తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ఇపుడు  చెప్పుకొస్తోంది. 

 

అయితే దీన్ని భారత్ మాత్రం నమ్మడంలేదు. ఎందుకంటే గత అనుభావాలు భారత్ కి చైనాతో చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా 1962లో చైనా ఇలాగే చెప్పి తరువాత అదను చూసి మరీ దాడి చేసింది. దాంతోనే ఏ మాత్రం సన్నధ్ధంగా లేని భారత్ ఓటమి పాలు అయింది. ఇపుడు అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు భారత్ వేయి కళ్ళతో నిఘా పెడుతోంది. 

 

చైనా సరిహద్దుల్లో ఇపుడు భారత్ సైన్యం కంటికి రెప్పలా కాపలా కాస్తోంది. అదే సమయంలో కమాండర్ స్థాయి అధికారులకు ఏమైనా చేసుకోవచ్చు అంటూ స్వేచ్చ కూడా ఇచ్చేశారు. ఇక లడక్ టూర్ కి ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళి వచ్చారు. సరిహద్దుల నుంచే చైనాకు గట్టి సవాల్ విసిరి మరీ వచ్చారు. 

 

ఇపుడు రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ సరిహద్దులకు వెళ్తున్నారు. ఆయన సైతం భారత్ సైన్యానికి గట్టి భరోసా ఇవ్వడంతో పాటు చైనా విషయంలో అప్రమత్తంగా ఉండేలా  సూచనలు చేస్తారని అంటున్నారు. రెండు రోజులపాటు ఆయన సరిహద్దుల్లో పర్యటిస్తారని అంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే భారత్ ఇంతలా నిఘా పెట్టడంతో చైనా కొత్త ఎత్తులు ఏం వేస్తుందన్నది కూడా చర్చగా ఉంది. చూడాలి మర్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: