కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం దేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రీతులుగా పాటు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఎక్కువగా వైరస్ ప్రభావం ఉండటంతో ప్లాస్మా థెరపీ విధానం ద్వారా బాగు చేయడానికి ఢిల్లీ సర్కార్ రెడీ అయినా విషయం అందరికీ తెలిసిందే. అదే విధంగా తెలంగాణలో కూడా కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్లాస్మా థెరపీ విధానం ద్వారా నయం చేయడానికి రెడీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో ప్లాస్మా డొనేట్ చేసే వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా తెలంగాణ అధికారులు కరోనా నుండి కోలుకుంటున్న వారికి ఆఫర్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇదే తరహాలో కర్ణాటక కూడా ప్లాస్మా విధానాన్ని ఆ  రాష్ట్రంలో అమలు చేయాలని అక్కడి ప్రభుత్వం డిసైడ్ అయింది.

 

ఈ సందర్భంగా కర్ణాటకలో కరోనా నుండి కోలుకున్న జనాలు తమ ప్లాస్మా కనుక డొనేట్ చేయడానికి అంగీకరిస్తే ఒక్కో వ్యక్తికి ప్రోత్సాహకంగా 5,000 రూపాయల నగదు బహుమతిని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చాలా వరకు ప్లాస్మా థెరపీ విధానం ద్వారా దేశంలో కరోనా రికవరీ రేటు పెరుగుతుండటంతో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇదే విధానాన్ని అవలంబించాలని రెడీ అవుతున్నాయి.

 

కర్ణాటక లో కూడా రోజురోజుకీ కరోనా వైరస్ ప్రభావం పెరుగుతున్న తరుణంలో ముఖ్యంగా బెంగళూరు వంటి మహానగరంలో వైరస్ వ్యాప్తి భారీ స్థాయిలో ఉండటంతో కర్ణాటక సర్కారు ఈ నిర్ణయం తీసుకుందట. ఇప్పటికే బెంగళూరులో ఈనెల 23 వరకూ లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. ప్లాస్మా విధానం ద్వారా ఇప్పటిదాకా దాదాపు 17 వేలకుపైగా రోగులు కరోనా నుండి కోలుకోవటంతో కర్ణాటక సర్కార్ ప్లాస్మా డొనేట్ చేసేవారికి నగదు ఇస్తూనే ప్రభుత్వ పరంగా కూడా వారి ఆరోగ్యానికి అండగా ఉంటుందని హామీ ఇవ్వటంతో చాలామంది ముందుకు వస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: