కొద్ది రోజుల క్రితం టిడిపి మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టయిన సంగతి తెలిసిందే. అచ్చెన్న అరెస్టును టిడిపి అధినేత చంద్రబాబు కిడ్నాప్ అంటూ అప్పట్లో వ్యాఖ్యానించారు. తమ నాయకుడిని వైసిపి కిడ్నాప్ చేయించింది అంటూ  ఆరోపణలు చేశారు. ఇక ఆ తర్వాత కొల్లు రవీంద్ర, చింతమనేని ప్రభాకర్, జేసీ ప్రభాకర్ రెడ్డి వంటివారు అరెస్టయ్యారు. ఇదిలా ఉంటే, త్వరలో ఈ అరెస్టుల జాబితాలో మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేరేలా కనిపిస్తున్నారు. ఈ మేరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో గంటాను ఉద్దేశించి పెట్టిన పోస్టింగ్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.

 

 

 గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉన్న సమయంలో పాఠశాల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ వ్యవహారంలో గంటా శ్రీనివాసరావు అవినీతికి పాల్పడ్డాడు అనే విధంగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. " తుప్పు సైకిళ్లపై ఘంటా శ్రీను గణగణ ...! 12 కోట్ల కొనుగోళ్లలో ఐదు కోట్ల అవినీతి! ఎస్.కె బైక్స్ నుంచి కొనవద్దని బ్లాక్ లిస్ట్ చేసిన బ్లాక్ మనీ కోసం తెగ తొక్కేశాడని ఫిర్యాదుల వెల్లువ.. !" అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా గంటాను టార్గెట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో త్వరలో గంటా కిడ్నాప్ కాబోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున కామెంట్ ల వర్షం కురిసింది. 

 

IHG

 

ఎప్పటి నుంచో గంటా శ్రీనివాసరావు టిడిపిని వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతూ వస్తోంది. ఆయన వైసీపీ లోకి రావాలని చూస్తున్నా, అందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఆయన బిజెపి వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న తీరు  చూస్తుంటే ఆయన అరెస్టు తప్పదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: