రెండు దేశాల మధ్య యుద్ధం అంటే సాధారణ విషయమేమీ కాదు.. సంధి కుదరకపోతేనో.. మాటలతోపని కాకపోతేనో.. యుద్ధాలు జరుగుతుంటాయి. ఒకసారి యుద్ధ రంగంలోకి దిగాక తాడోపేడో తేల్చుకోవాల్సిందే. ఇలా మొదలైన యుద్ధం ఎంత సేపు జరుగుతుంది.. కొన్ని యుద్ధాలు రోజుల తరబడి జరగొచ్చు.. మరికొన్ని నెలల తరబడీ జరగొచ్చు. కానీ ప్రపంచంలో ఓ యుద్ధం మాత్రం గంటసేపటిలోగానే ముగిసింది. 

 

IHG

 

ప్రపంచంలోనే అతి చిన్న యుద్ధంగా పేర్కొనే ఆ రణంఎలా జరిగిందో తెలుసుకుందాం..ఈ అతి చిన్న యుద్ధం బ్రిటీష్ సైన్యానికి, నేటి టాంజానియా దేశంలోని జంజిబర్ సుల్తానేట్‌ అనే స్వతంత్ర్య రాజ్యానికి 1896లో జరిగింది. అసలు యుద్ధం అవసరం ఎందుకు వచ్చిందంటే.. జంజిబర్‌ సుల్తానేట్‌ స్వతంత్ర్య రాజ్యమే అయినా.. అక్కడ పాలించే రాజును నిర్ణయించేది మాత్రం బ్రిటీష్ సైన్యమే. అలా ఒప్పందం చేసుకున్నందువల్లే అప్పట్లో బ్రిటీష్ సైన్యం దాన్ని ఆక్రమించకుండా వదిలేసింది.

 

IHG's ...

 

1896లో జంజిబర్‌ సుల్తానేట్‌ సుల్తాన్‌ హమద్‌ బిన్‌ తువైనీ అనూహ్యంగా చనిపోయాడు. సుల్తాన్‌ ఖలీద్‌ బిన్‌ బర్గాష్‌ సింహాసనం ఎక్కాడు. అది బ్రిటిష్‌ వాళ్లకు నచ్చలేదు. వాళ్లు తమ నమ్మిన బంటు హమూద్‌ బిన్‌ మహ్మద్‌ను రాజును చెయ్యాలనుకున్నారు. విషయం తెలుసుకున్న బ్రిటీష్ పాలకులు ఖలీద్ సుల్తానేట్ పై యుద్ధం ప్రకటించారు. ఆగస్టు 27 ఉదయం 9 గంటల 2 నిమిషాలకు యుద్ధం ప్రారంభమైంది.

 

IHG

 

బ్రిటష్ సైన్యం ముందు అతి చిన్నదైన సుల్తాన్ సైన్యం గంటసేపు కూడా నిలువలేకపోయింది. 44 నిమిషాల్లో యుద్ధం ముగిసింది. బ్రిటీష్ సైన్యం తమవైపు నుంచి ప్రాణనష్టం లేకుండానే ఖలీద్‌ సైన్యంలో 500 మందిని చంపేసింది. చివరకు సుల్తాన్ ఖలీద్‌ టాంజానియాకు పారిపోతుంటే పట్టుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: