అధికారంలో ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, అధికారం దూరమైతే పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అనే విషయం ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు బాగా తెలిసొచ్చినట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు టీడీపీ కి కంచుకోటగా ఉన్న నియోజక వర్గాలు కూడా ఇప్పుడు బీటలు వాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వచ్చింది. ఇక్కడ అభ్యర్థి ఎవరైనా, ఎగిరేది మాత్రం పసుపు జెండా మాత్రమే అన్నట్టుగా పరిస్థితి ఉండేది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ గెలుపొందారు. గన్నవరం నియోజకవర్గంలో తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే, ఆరు సార్లు టిడిపి విజయం సాధించింది. అక్కడ  కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటం కూడా ఆ పార్టీకి కలిసొస్తుంది. కాకపోతే ఇప్పుడు ఆ నియోజకవర్గంలో పార్టీని ముందుకు నడిపించే నాయకుడు కరువయ్యారు. ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ, పార్టీకి రాజీనామా చేయడంతో పాటు, వైసీపీకి అనుబంధంగా కొనసాగుతుండడంతో పార్టీ ని లీడ్  చేసే నాయకుడు కనిపించడం లేదు. 

IHG


దాదాపు ఎనిమిది నెలలుగా ఇదే పరిస్థితి ఉంది. తిరిగి పార్టీని పట్టా లెక్కించేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. పార్టీలో ఉన్న కీలక నాయకులకు ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగిద్దామని చూస్తున్నా, వారు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి లేదు. గద్దె అనురాధ ఇక్కడ పార్టీ ఇన్చార్జిగా నియమించారు. ఆమె గన్నవరం బాధ్యతలు స్వీకరించేందుకు ఇష్టపడడం లేదు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన ముద్రబోయిన వెంకటేశ్వర సైతం, ప్రస్తుతం నూజివీడు బాధ్యతలు చూస్తుండడంతో గన్నవరం బాధ్యతలు స్వీకరించేందుకు ఎవరూ ముందుకు వచ్చేలా కనిపించడం లేదు.

IHG


 తాజాగా, టీడీపీ నాయకుడు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన దేవినేని ఉమ కు ఈ బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు చూసినా, ఆయన కూడా విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారు ఇలా మొహం చాటేస్తుండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అలాగే వల్లభనేని వంశీ త్వరలో తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తుండడంతో, గన్నవరంలో ఉప ఎన్నిక జరిగితే, అప్పుడు పరిస్థితి ఏంటా అనే టెన్షన్ ఇప్పుడు పార్టీలో నెలకొంది. ఈ నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించేందుకు పార్టీ నాయకులు అందరూ వెనకడుగు వేస్తున్నట్టుగా, ప్రస్తుతం పరిస్థితులను చూస్తే అర్థం అవుతోంది. ఈ వ్యవహారాలను చూస్తుంటే కంచుకోట బద్దలయ్యేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: