వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక వర్గాల సమతూకం ఉండేలా జగన్ జాగ్రత్త పడ్డారు. ఆ మేరకు మంత్రిమండలిని కూర్పు చేశారు. దీంట్లో వీర  విధేయులు ఎందరికో మొండి చేయి చూపాల్సి వచ్చింది. అయినా సామాజిక వర్గాల లెక్కలు చూడడం లోనూ, ఆ లెక్కలు సరిచేయడంలోనూ జగన్ సక్సెస్ అయ్యారు. జగన్ క్యాబినెట్ పై నోరు మెదిపేందుకు విపక్షాలకు సైతం అవకాశం దొరకలేదు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో మంత్రుల పనితీరుపై జగన్ కు కొంత అసంతృప్తి ఏర్పడినట్టుగా కనిపిస్తోంది. కొంతమంది మంత్రులు పనితీరు పరంగా ఫర్వాలేదు అన్నట్టుగా అనిపించుకుంటున్నా, మరికొంతమంది పనితీరు, మితి మీరిన జోక్యం, అవినీతి వ్యవహారాలు వంటివి జగన్ కు రుచించడం లేదు.

IHG


 ఇదే సమయంలో ఇప్పుడు ఇద్దరు మంత్రులు రాజ్యసభకు వెళ్ళబోతున్నారు.దీంతో వారు తమ పదవులకు రాజీనామా  చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మంత్రి మండలి అనే తేనె తుట్టెను కదపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం రాజీనామా చేయబోతున్న వారి స్థానాల్లో, వేరొకరిని నియమించాలి. అందుకే ఈ నెల 22వ తేదీన మంత్రివర్గ విస్తరణ చేపట్టాలనే ఆలోచనకు జగన్ వచ్చినట్టుగా కనిపిస్తున్నారు. కేవలం కొత్తగా కొంతమందిని మంత్రులుగా తీసుకోవడంతో పాటు, ప్రస్తుత మంత్రుల్లో కొంతమందిని తప్పించి, మరికొంతమంది కొత్తవారిని తీసుకోవాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కొంతమంది మంత్రుల శాఖల్లో మార్పు చేర్పులు చేయబోతున్నట్ల వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

IHG


 ప్రస్తుతం ఈ వ్యవహారంపైనే పార్టీలో నేతల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ఎవరి పనితీరు ఎలా ఉంది అనే విషయంపై జగన్ వద్ద రిపోర్ట్ ఉండడంతో ఎవరి పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియని సందిగ్ధత నెలకొంది. మంత్రుల పనితీరు పై జగన్ కు అందిన రిపోర్ట్ ఏంటి ? ఎవెరెవరకి ఛాన్స్ ఉంది ఇలా అనేక అంశాలపై ప్రస్తుత మంత్రులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: