ఏపీ సీఎం జగన్ కు కేంద్ర మంత్రి ఒకరు ఫోన్ చేశారు. అయితే ఇదేదో రాజకీయపరమైన కాల్ మాత్రం కాదు.. ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్‌ ఫోన్‌ చేశారు. కొవిడ్‌పై పోరుకు రూ.179 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్లు హర్షవర్థన్‌ వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది.

 

IHG


ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరిస్థితిని జగన్ ఆయనకు వివరించినట్టు తెలుస్తోంది. రాష్ట్రం కరోనా కట్టడి కోసం తాము ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది జగన్ కేంద్ర మంత్రికి వివరించినట్టు సమాచారం. రాష్ట్రంలో పెద్దఎత్తున పరీక్షలు జరపుతున్నామని జగన్ చెప్పారు. రోజుకు 22 వేలకు పైగా టెస్టులు జరుపుతున్నామని... వ్యాధి లక్షణాలను ముందుగా గుర్తించి బాధితులకు వెంటనే ట్రీట్ మెంట్ చేస్తున్నామని జగన్ ఆయనకు వివరించినట్టు తెలిసింది. 

 

IHG


అయితే కేంద్ర మంత్రి ఇలా రాష్ట్రముఖ్యమంత్రులతో మాట్లాడటం కొత్తేమీ కాదు.. కరోనా కేసులు ఎక్కువగా వస్తున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరోగ్యమంత్రులతో హర్షవర్థన్‌ ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఆయన ఇటీవలే కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల ఆరోగ్యమంత్రులతోనూ మాట్లాడారు. 

 

IHG

ఏపీలో కరోనా పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా తయారవుతోంది. తాజాగా ఏకంగా 2400పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఐదు రోజుల్లనే దాదాపు 160 మంది చనిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: