ఏదైనా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, అది ఆ రాష్ట్రాన్నిపాలించే నాయకుడి చేతిలో ఉంటుంది.. ఆ నాయకుడు సమర్ధవంతుడైతే ఆ రాష్ట్రంతో పాటుగా, ఆక్కడి ప్రజలు కూడా సుఖ సంతోషాలతో జీవిస్తారన్నది సత్యం.. ఈ విషయం ఏపీ సీయం జగన్ గారిని చూస్తే అర్ధం అవుతుంది.. తాను పదవిలోకి వచ్చినప్పటి నుండి పేదప్రజలకు అండగా ఉంటూ, ఎన్నో విలువైన పధకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగుతున్నాడు.. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో తాను చేసిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారు..

 

 

ఇక ఇప్పటికే పేద ప్రజలకోసం అనేక పధకాలు అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే.. అదీగాక ఈ కరోనా సంక్షోభంలో కూడా పేదవారు ఆకలితో అలమటించకుండా సమయానికి రేషన్ సరకులు అందేలా చర్యలు తీసుకుంటున్నారు.. ఈ నేపధ్యంలో ఏపీలోని మహిళలకు మరో తీపి వార్తను సిద్దం చేశారు.. ఇక ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో వైఎస్సార్ చేయూత పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.

 

 

ఇదివరకే వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద ప్రతి నెలా పెన్షన్‌ అందుకుంటున్న పలు వర్గాల మహిళలకు కూడా రానున్న నాలుగేళ్లలో రూ.75 వేలు అందించాలని ఆదేశించారు. ఈ నిర్ణయంతో పెన్షన్‌ కానుక అందుకుంటున్న వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులైన మహిళలు, చేనేతలు, గీత, మత్స్యకార మహిళలకూ లబ్ది చేకూరనుంది. ఈ పథకం ఎన్నికల సమయంలో అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. కాగా ఈ పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న మహిళలందరికీ ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సాయం అందించనున్నారు.

 

 

అయితే ఆగస్టు 12న సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్న నేపధ్యంలో జూన్‌ 28 నుంచి లబ్ధిదారులు దరఖాస్తులు ఇచ్చారు.. ఇక జగన్ ప్రతి పేదవారి ఇంటి పెద్ద కొడుకుగా మారి వారిని ఆదుకుంటున్న విషయం తెలిసిందే..  

మరింత సమాచారం తెలుసుకోండి: