బిత్తిరి సత్తి.. పెద్దగా పరిచయం అవసరం లేని కమెడియన్.. కమ్ యాంకర్.. ఆయన తాజాగా సాక్షి టీవీలో చేరిన సంగతి తెలిసిందే. ఇటీవలే టీవీ 9 నుంచి బయటకు వచ్చి జగన్ ఛానల్‌లో చేరాడు. అయితే.. కొన్నాళ్ల క్రితమే వీ6 నుంచి బిత్తిరి సత్తిని అత్యధిక పారితోషకం ఇచ్చి మరీ తెచ్చుకున్న టీవీ9 ఆ తర్వాత కొద్దికాలానికే అతన్ని వదిలించుకుంది. 

 


అత్యధిక పారితోషకం కారణంగానే బిత్తిరి సత్తిని టీవీ9 వదిలించుకుందనే టాక్ ఉన్నా.. ఫాదర్స్ డే రోజు సత్తి చేసిన స్కిట్‌ అతన్ని బయటకు పంపేందుకు తక్షణ కారణంగా ప్రచారంలోకి వచ్చింది. ఫాదర్స్ డే రోజు సత్తి తన తండ్రి ఫోటోను అనుమతి లేకుండా స్కిట్ లో వాడాడన్నది అభియోగం.. దానిపై చర్చల తర్వాత సత్తి టీవీ9 నుంచి బయటకు వచ్చేశాడు. 

 


అయితే సాక్షి టీవీలో ఎంట్రీ ఇచ్చిన సత్తి ప్రోమోతోనే అదరగొట్టాడని చెప్పొచ్చు. అంతే కాదు.. ఈ ప్రోమో ద్వారా తనను తండ్రి ఫోటో వాడినందుకు వెళ్లగొట్టారన్న విషయాన్ని ఆయనే పరోక్షంగా ప్రస్తావించారు. అదే సమయంలో టీవీ9 తీరుపై సెటైర్లు కూడా పేల్చేశాడు. సాక్షిలో సత్తి ఎంట్రీ బాగుంది. పోయిన చోటే వెతుక్కోవాలంటారు. సత్తి కూడా ఏ ఇన్సిడెంట్ తనను ఇబ్బందుల పాల్జేసిందో.. అక్కడే మళ్లీ మొదలుపెట్టాడు. 

 


తనపై తానే సెటైర్ వేసుకుంటూ... నాన్న సెంటిమెంట్ ముడిపెట్టి.. ప్రోమో మాత్రం బాగా చేశాడు. ఈ ప్రోమోలో తండ్రి, కొడుకులుగా డ్యూయల్ రోల్ తో ఎంట్రీ బాగా ఇచ్చాడు.  అందరికీ ఆవేళ ఫాదర్స్ డే.. నా ఒక్కడికే ప్రాబ్లమ్స్ డే అని తనపై తానే సెటైర్ వేసుకున్నాడు. న్యూస్ కాస్తా అనుకోకుండా న్యూసెన్స్ అయిపోయింది.. టైమ్ కానప్పుడు నవరంధ్రాలు మూసుకోవాలె.. అంటూ సెటైర్ పేల్చాడు. 

 


నవరంధ్రాలు అంటూ పరోక్షంగా టీవీ9కు చురకలు వేశాడు. అంతే కాదు.. తండ్రిని గౌరవించే ఛానెల్ ఇది. నీకు తిరుగులేదు అని తండ్రి పాత్రతో చెప్పించడం ద్వారా వైఎస్‌ను, జగన్ ను గుర్తు చేశారు. ప్రోమో అయితే అదిరింది.. మరి ఎపిసోడ్ ఎలా ఉంటుందో..?  

 

మరింత సమాచారం తెలుసుకోండి: