ఏపీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై కొంతకాలంగా టిడిపి ఆందోళనలో ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ నాయకులను ఈ విషయంలో ఆందోళన పెరిగిపోతుండడంతో, ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఈరోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి అనేక ఫిర్యాదులు చేశారు. రాష్ట్రంలో గత మూడు నెలలుగా జరుగుతున్న పరిణామాలు, రాజకీయ వేధింపులు, తెలుగుదేశం నాయకులే టార్గెట్ గా జరుగుతున్న అరెస్ట్ లు, వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలపై సమగ్రంగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లు టిడిపి ఎంపీలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కాపాడాలని రాష్ట్రపతిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని, ఇప్పటికే తన దృష్టికి కొన్ని విషయాలు వచ్చాయని, దీనిపై సమగ్రంగా విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లుగా టిడిపి ఎంపీలు రాష్ట్రపతిని కలిసిన తర్వాత మీడియాకు వెల్లడించారు.


 ఏపీ సీఎం జగన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ, కేవలం ఆ పార్టీ వారికి మేలు జరిగే విధంగా వ్యవహరిస్తున్నారంటూ, ఈ సందర్భంగా టిడిపి ఎంపీలు విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ, అనేక దాడులకు వైసిపి నాయకులు పాల్పడుతున్నా, వారిని మరింతగా ప్రోత్సహిస్తూ, పౌరుల హక్కులకు భంగం కలిగిస్తున్నారని, రాజ్యాంగ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారిపైన, సంస్థల పైన దాడులు చేస్తున్నారని, పేదల భూములు అన్యాయంగా లాక్కుంటున్నారని, ఎవరైనా ఈ విషయంపై నోరు ఎత్తితే, వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, ఇలా అనేక అంశాలపై  రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినట్లుగా టిడిపి ఎంపీలు వెల్లడించారు. 

 

IHG


కాకపోతే ఇంత అకస్మాత్తుగా వీరు రాష్ట్రపతిని కలవడం వెనుక IHG ఎత్తుగడ చాలానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున పార్టీ నాయకులు వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండడం, నిస్తేజంలో ఉన్న కార్యాకర్తల్లో ఉత్సాహం తీసుకురావాలనే ఉద్దేశంతో IHG ఈ విధంగా ప్లాన్ చేసినట్లు గా అర్థం అవుతోంది. రాష్ట్రపతితో భేటీ అయిన వారిలో టిడిపి ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కేసినేని నాని, గళ్ళ జయదేవ్ తదితరులు ఉన్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతిని కలవబోతున్నట్లు నిన్ననే మీడియాకు టిడిపి సమాచారం అందించినట్టుగానే, ఈరోజు అపాయింట్మెంట్ దొరకడంతో 
వెళ్లి ఫిర్యాదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: