రాజకీయాల్లో ఉన్నాక ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. అదే సమయంలో కొన్నిసార్లు నీలాపనిందలు కూడా వస్తుంటాయి. ఏమాత్రం అవకాశం దొరికినా ప్రతిపక్షాలు అధికారపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇప్పుడు ఏపీలో అలాంటి సీన్ ఎదురైంది. తమిళనాడులో భారీగ నగదుతో పట్టుబడిన ఓ కారు ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిదేనంటూ ప్రచారం జరిగింది. 

 

ఇందుకు కారణం లేకపోలేదు. ఆ కారుపై స్టిక్కర్ ఆయన పేరుమీదే ఉంది. దీంతో ఏపీలో కోట్ల రూపాయల నగదుతో దొరికిపోయిన ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కారు అంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని మంత్రి శ్రీనివాస రెడ్డి మొదట్లోనే ఖండించారు. అయినా ప్రచారం ఆగలేదు. దీంతో ఆయన ఏకంగా ఓ సవాల్ విసిరారు. 

 

IHG

 

అదేంటంటే.. చెన్నైలో పట్టుబడిన నగదుతో తనకు సంబంధం ఉందని రుజువు చేస్తే పదవిని వదలుకోవడమే కాదని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విపక్షాలకు సవాల్ విసిరారు. ప్రత్యేకించి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు నోరు అదుపులో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 

 

పట్టుబడిన నగదు తనదేనని బంగారం షాపు యజమాని ఇప్పటికే ప్రకటన చేశారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గుర్తు చేశారు. 2014లో అధికారంలోకి అడ్డదారిలో వచ్చిన లోకేశ్ వేల కోట్లు సంపాదించి  ఇప్పుడు తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గురించి ఒంగోలులోని టీడీపీ నేతలను కనుక్కోవాలని బాలినేని హితవు పలికారు. 

 

తనపై చేసిన ఆరోపణలను రుజువు చేయకపోతే మాజీ మంత్రి లోకేష్ క్షమాపణ చెప్పాలని బాలినేని డిమాండ్ చేశారు. లోకేష్ జీవితంలో ఎమ్మెల్యేగా గెలవలేరని బాలినేని అంటున్నారు. సోషల్ మీడియాలో తనపై ఇష్టానుసారం పోస్టులు పెట్టేవారిపై చర్య తీసుకుంటానని మంత్రి బాలినేని వార్నింగ్ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: