తనతో సెక్స్ కి నిరాకరించడం తో కిరాతకంగా ఆమె తల ని నరికేసాడు అంతేకాకుండా అడ్డు వచ్చిన ఆమె తల్లి తల ని కూడా నరికేసి రోడ్డుపై పడేసాడో మానవ మృగం. ఈ దారుణ సంఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి అనే గ్రామంలో జరిగింది. భర్త చనిపోవడంతో చిన్ని అనే మహిళ తన తల్లి చంద్రమ్మ తో కలిసి జీవిస్తోంది. ఇదే గ్రామానికి చెందిన శివయ్య అనే అరటికాయల వ్యాపారి కన్ను చిన్ని పై పడింది,తనతో వివాహేతర సంబంధం కొనసాగించాలని చిన్ని ని వేదిస్తుండటం తో ఆమె వ్యతిరేకించింది. ఆ సంబంధం పెట్టుకోనని తేల్చి చెప్పేయడం తో కోపోద్రిక్తుడైన శివయ్య నేరుగా గురువారం ఉదయం చిన్ని ఇంటికి వెళ్లి బలాత్కారం చేయడానికి ప్రయత్నించాడు కానీ చిన్ని లొంగక పోవడంతో తన వెంట తెచ్చుకున్న కొడవలి తో ఇద్దరు మహిళల తలలను నరికి రోడ్డు పై పడేసి భయానక వాతావరణం సృష్టించాడు. హంతకుడి కోసం పోలీసులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: