పాదం అడుగున పుట్టుమచ్చ ఉంటే మీరు ఏమి అనుకుంటారు? మీ చెంప మీద ఉన్న బ్యూటి స్పాట్ ఏమి చెప్పుతుంది? ఈ ప్రశ్నల అన్నింటికీ సమాధానం కావాలంటే,మీరు మీ శరీరంలో పుట్టుమచ్చల రహస్య డీకోడ్ ను తెలుసుకోవటానికి ఈ వ్యాసంను చదవండి. పుట్టుమచ్చలు అనేవి మన చర్మంపై సహజంగా పెరుగుతాయి. ఇవి శరీరంలో ముఖ్యమైనవి కాదు. అందువల్ల కొన్నిసార్లు వీటిని తొలగిస్తూ ఉంటాము. కానీ కొన్ని పుట్టుమచ్చలు మంచి జ్యోతిష్యపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మరియు సాంఘిక కార్యకలాపాలను అంచనా వేయటానికి జ్యోతిషశాస్త్రంలో మోలోసోఫి అనే ఒక కాన్సెప్ట్ ఉంది. మోలోసోఫి అనేది మీ జీవితం యొక్క ప్రాముఖ్యత మరియు మీ శరీరం యొక్క పుట్టుమచ్చల ప్రభావం ఏ విధంగా చూపుతుందో తెలుసుకోవడానికి సహాయపడుతుంది. మీ శరీరం మీద ఉన్న పుట్టుమచ్చలు మీ జీవితం మరియు వ్యక్తిత్వం గురించి ఏమి చెప్పుతాయో తెలుసుకోవటానికి దీనిని చదవండి. నుదురు కుడి భాగంలో పుట్టు మచ్చ ఉంటే మీరు ఎల్లప్పుడూ సంపదతో ఆనందంగా ఉంటారని అర్థం. అదే ఎడమ భాగంలో పుట్టు మచ్చ ఉంటే దుఃఖాన్ని పొందటం, జీవితంలో అన్నింటిని నష్టపోతారని అర్థం. నుదురు మధ్యలో ఉంటే కీర్తిని కలిగి ఉంటారని అర్థం. కుడి కన్ను పైన పుట్టుమచ్చ ఉంటే శుభవార్తలు వింటారు. ఎల్లప్పుడూ మీరు మీ జీవిత భాగస్వామి నుంచి ప్రేమను పొందుతుంటారు. ఎడమ కన్నుపైన ఉంటే మీకు ఎల్లప్పుడూ బయట విషయాల మీద పోరాటం చేస్తుంటారు. అదే కుడి చెంపై పుట్టుమచ్చ ఉంటే ఎక్కువ సంపద కలిగి ఉంటారని అర్థం. ఎడమ చెంప మీద ఉంటే సంపద కోల్పోయి బాధ పడుతారని అర్థం. పెదవులపై ఉంటే ఎక్కువగా శృగారంపై ఆసక్తి ఉంటుంది. ముక్కు మీద ఉంటే జీవితాంతం చాలా ప్రయాణాలు చేస్తున్నారు. గడ్డం మీద పుట్టుమచ్చ ఉంటే మీరు జాగ్రత్తాగా ఉండాలి. దీని వలన మీరు ఎల్లప్పుడూ మీ జీవిత భాగస్వామితో ఘర్షణలు జరుగుతుంటాయని సూచిస్తుంది. మెడ మీద పుట్టుమచ్చ ఉంటే ఎక్కువకాలం లగ్జరీ జీవితాన్ని గడుపుతారని అర్థం. కుడి చెవి తక్కువ జీవిత కాలాన్ని, ఎడమ చెవి మీద ఉంటే ప్రమాదాల నుంచి కాపాడుతుందని అర్థం. అరచేతిలో ఉంటే సంపద ఎక్కువగా ఉంటుందని, ఎడమ సంపద కోల్పోతారని సూచిస్తుంది. కుడి చేతిపైన ఉంటే ధైర్యవంతులుగా,ఇతరుల చేత గౌరవించబడుతారు. ఎడమ చేతిపై ఉంటే మగ శిశువు కలిగి ఉంటారని సూచిస్తుంది. కాళ్ల మీద పుట్టుమ ఉంటే ఆ వ్యక్తి చాలా ప్రయాణం చేస్తారు. కను బొమ్మ మధ్య పుట్టుమచ్చ ఉంటే మీరు విదేశాల్లో ప్రయాణం చేస్తారని చెబుతుంది. నడుము మీద ఉంటే మీరు భౌతిక ఆనందం, అన్ని రకాల ఆనందాలు పొందే అవకాశం, వీపు మీద ఉంటే ఇతరుల మీద ఆధారపడటం, చెబు నోరు కలిగి ఉంటారు. నాభి మీద శృగారంపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఎడమ భుజం ఉంటే పిరికి వాడు, అసంతృప్తి, కుడి భుజం పుట్టుమచ్చ ఉంటే చాలా ధైర్యం, సామర్థ్యం కలిగి ఉంటారని అర్థం.

మరింత సమాచారం తెలుసుకోండి: