మొదట క్రిస్మస్ రోజున స్కూల్ పిల్లలకు కూడా సెలవు లేకుండా చేద్దామని అనుకొన్నారు కేంద్ర ప్రభుత్వం వారు. అయితే ఆ విషయంలో ప్రతిపక్షాల నుంచి వ్యక్తమైన ఆందోళనతో వెనక్కు తగ్గారు. చివరకు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం క్రిస్మస్ సెలవు లేకుండా చేశారు. కేవలం క్రిస్టియన్లకే కాదు.. యావత్ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇది ఇబ్బందికరమైన అంశమే. సంవత్సరాంతంలో క్రిస్మస్ సెలవును అందరూ హ్యాపీగా ఉపయోగించుకొనే వారు. అయితే ఇకపై మాత్రం ఆ అవకాశం ఉండదు. ప్రతియేటా డిసెంబర్ 25 ని సుపరిపాలన దినోత్సవంగా సెలబ్రేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిది. మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయి పుట్టిన రోజు సందర్భంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని స్కూళ్లలో కూడా సెలబ్రేట్ చేయాలనేది మొదటి ప్రతిపాదన. స్కూల్ స్థాయిలోనే భారతీయ జనతాపార్టీ నేత పుట్టిన రోజును ఈ విధంగా సెలబ్రేట్ చేయడం మొదలు పెడితే.. భవిష్యత్తుల్లో కమలదళం గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం ఉండదనే లాజిక్ ను ఇక్కడ అప్లై చేయాలని ప్రయత్నించారు. అయితే ఈ విషయంలో ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. అయితే పూర్తి స్థాయిలో కాదు.. ప్రభుత్వ కార్యాలయాల్లో సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో అధికారులు అంతా యధావిధిగా క్రిస్మస్ రోజున కార్యాలయాలకు హాజరు కావాల్సి ఉంటుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: