ఆరోగ్య శ్రీ లోగోను తెలుగుదేశం అధికారంలోకి వచ్చాకా మార్చేశారు. అధికారం చేతులు మారిన తరుణంలో ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ ఆరోగ్యసేవ అంటూ నామకరణం చేసి.. కొత్త లోగోలో చంద్రబాబు బొమ్మను పెట్టారు. చంద్రబాబు బొమ్మ చుట్టూ ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అనే ముద్రను తయారు చేశారు. కొత్తగా ఇచ్చిన ఆరోగ్య శ్రీ కార్డుల్లో ఈ ముద్రనే వాడారు.

అయితే ఏమైందో ఏమో కానీ ఇప్పుడు ఆ ముద్రలో మార్పు తీసుకొచ్చారు. ఉన్నట్టుండి ఎన్టీఆర్ ఆరోగ్యసేవ లోగోలో చంద్రబాబు బొమ్మను తొలగించారు. ఎన్టీఆర్ బొమ్మను వేశారు. మరి ఈ మార్పు ఎందుకు జరిగిందో కానీ.. ఇదే ఫైనల్ లోగో అని తెలుస్తోంది. ఎన్టీఆర్ బొమ్ము.. చుట్టూ ఎన్టీఆర్ ఆరోగ్యసేవ అని రాసి ఉంచిన లోగోను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది.

మరి ఈ మార్పు ఎందుకు తీసుకొచ్చారో కానీ.. బాబు బొమ్మను తీసి వేసి ఎన్టీఆర్ బొమ్మ ను పెట్టడం అయితే ఆసక్తికరంగా ఉంది. వెనుకటికి కాంగ్రెస్ హయాంలో ఈ సేవ లో రాజీవ్ గాంధీ బొమ్మను వాడారు. తద్వారా తమ పార్టీ పాత నేతలను కాంగ్రెస్ వాళ్లు గౌరవించుకొన్నారు.

అయితే బాబు మాత్రం సొంత బొమ్మతో కొంతకాలం బండిని లాగించే ప్రయత్నం చేశారు. ఎందుకో ఇప్పుడు మాత్రం మార్పు తీసుకొచ్చారు!

మరింత సమాచారం తెలుసుకోండి: