నిజమే రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతుండగా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో 2013 సంవత్సరంలో శ్రీశాంత్ ఔటయిన విషయం తెలిసిందే. మొదటి నుంచి మనోడు దూకుడు స్వభావం కలిగిన ఆటగాడు గతంలో హర్ భజన్ సింగ్ తన చెంపపై కొట్టాడని వెక్కి వెక్కి ఏడ్చి రచ్చ రచ్చ చేశాడు. హీరోయిన్ల వెంట పడటం వారితో ఫోటో ఫోజులు ఇచ్చి దొరకటం ఇలా ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచాడు.

తాజాగా కేరళలో వినిపిస్తున్న వార్తల ప్రకారం 2013 మే నెలలో తీహార్ జైల్లో 26 రోజులు గడిపిన సయంలో జైలు ప్రాంగణంలో తాను నడిచి వెళ్తుండగా.. ఓ రౌడీ పదునైన కత్తితో తనమీద దాడి చేశాడని ఆ దాడిలో చిన్న గాయమైందని అంతలోనే జైలు సిబ్బంది వచ్చి అతన్ని పట్టుకున్నారని ఈ విషయం తన బందువైన బాలకృష్ణన్ తో చెప్పి బాదపడ్డాడట. కానీ దీన్ని ఏ మాత్రం వివాదాస్పదం కానివ్వకుండా జాగ్రత్త పడ్డాడట.

దాడి ఘటన తర్వాత ఉన్నతాధికారులు శ్రీశాంత్‌ను ప్రత్యేక జైలులో ఉంచారని బాలకృష్ణ చెప్పారు. ‘అయితే దాడి ఘటనపై అధికారులు చర్యలు తీసుకున్నారో లేదో మాకు తెలియదని బాలకృష్ణన్ అన్నారు. ఐపిఎల్ స్కామ్‌కు సంబందించే ఈ దాడి జరిగిందని ఖచ్చితంగా చెప్పలేం' అని బాలకృష్ణ కూడా చెప్పారు.

అంతే కాదు 2007లో జరిగిన ట్వంటీ20 ప్రపంచ కప్, 2011లో జరిగిన వన్డే ప్రపంచ కప్ సాధించిన భారత జట్టులో శ్రీశాంత్ కూడా భాగస్వామిగా ఉన్నాడు. శ్రీశాంత్ మీద ఢిల్లీ పోలీసులు మోకా చట్టం కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీకోర్టులో విచారణ జరుగుతోంది. తీర్పు వచ్చే నెలలో విడుదల అవుతుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: