ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని కోసం రైతుల్ని బలి పెట్టొద్దు.. అవసరమైతేవారి తరఫున పోరాడతాను.. అని చెప్పిన పవన్‌కళ్యాణ్ మాటల వ‌ర‌కేప‌రిమిత‌మ‌య్యాడు. అపుడ‌ప్పుడు ట్వీట‌ర్ లో త‌మ సందేశాల‌ను పంపిస్తూఉన్నాడే త‌ప్పా.. ప్ర‌జా క్షేత్రంలో మాత్రం క‌న‌బ‌డుట‌లేదు.ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధానిలో రైతుల ఆందోళనలు పెరుగుతున్నా.. జనసేనఅధినేత ఆచూకీ లేదు. రాజధాని రైతులు మాత్రమే కాదు, భోగాపురం రైతుబాధితులు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించేందుకు రాజకీయాల్లోకొచ్చాననిచెప్పుకువ‌చ్చిన‌ పవన్‌, రైతుల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకైనా జనంముందుకు రాక‌పోవ‌డం ఆశ్చర్యకరమే. మ‌రోవైపు గ్రేట‌ర్ హైద‌రాబాద్ఎన్నిక‌ల్లో పోటికి జ‌న‌సేన యోచిస్తోంద‌ని తెలుస్తోంది.


జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్


గ‌త నెల మార్చి లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గన్నవరం పర్యటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రైతుల దగ్గర నుండి బలవంతంగా భూములులాక్కోవద్దని ప్ర‌భుత్వాన్ని విజ్ఞ‌ప్తి చేశాడు. బాగానే ఉంది కానీ.. గతఎన్నికల్లో టీడీపీ తరుపున ప్రచారం చేసి ఆ పార్టీ విజయంలో కీలక పాత్రపోషించిన పవన్ కళ్యాణ్, మొట్ట మొదటి సారిగా ఆ ప్రభుత్వం చేపడుతున్నల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో పర్యటించ‌డం, రైతులకన్నీళ్లతో ఏర్పడే రాజదాని వద్దని చెప్ప‌డం, తమంతట తాముగా సంతోషంగాభూములు ఇస్తేనే తీసుకోవాలే త‌ప్ప‌, రైతుల కన్నీరు పెడితే అశుభమని, ఆ శోకంరాజధానికి తగులుతుందని. డెడ్ లైన్ పేరుతో రైతుల భూములు లాక్కోవద్దనిటీడీపీ ప్రభుత్వానికి తెలియజేయ‌డంలాంటివి కొంత వ‌ర‌కు నమ్మినా,ప్ర‌స్త‌తం ఆయ‌న ఆవ‌లంభిస్తున్న వైఖ‌రి మాత్రం అనుమానాల‌కు తావిస్తోంది.

 

పవన్ సామాజికవర్గం వారు కావడం


విజయనగరం భోగాపురంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం సుమారు 15వేల ఎకరాలను రైతుల నుండి ప్రభుత్వo బలవంతంగా తీసుకునే ప్ర‌భుత్వం యోచిస్తోంది. ఈపరిస్థితుల్లో పవన్ కు కొత్త సమస్య రావ‌డంతో దిక్కుతోచ‌ని ప‌రిస్థితివ‌చ్చి ప‌డింది. ఈ భూములు కోల్పోయేవారిలో ఎక్కువ మంది పవన్ సామాజికవర్గం వారు కావడం పవన్‌కల్యాణ్‌ని మరింత ఇబ్బందుల్లో నెట్టింది. దీంతోపవన్ అటు ప్రధాని మోదీనిగానీ ఇటు ఏపీ సీఎం చంద్రబాబుని గానీ సమర్థించ లేకవ్యతిరేకించ లేక తన దగ్గరకు వస్తున్న భోగాపురం రైతు ప్రతినిధులనుకలవకుండా తప్పించుకుంటున్నాడన్న వాస్త‌వం బ‌ల‌ప‌డుతోంది.


 పవన్ మరింత మానసిక సంఘర్షణకు


ఈమధ్య తనను తరుచూ కలుస్తున్న రాజకీయ ప్రముఖులతో పవన్ వర్తమాన రాజకీయ వాతావరణం పైనే చర్చిస్తూ ఈ ప్రభుత్వాలు అనవసరంగా రైతుల జోలికి ఎందుకువెళ్తున్నాయని, పవన్ మ‌ద‌నప‌డుతున్నాడని స‌మాచారం. ఇప్పటికే కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో చేతులెత్తేసిన నేపధ్యంలో పవన్ స్పందించడం లేదు అని కామెంట్స్ వస్తున్నాయి. ఈ నేపధ్యంలోఊహించని ట్విస్ట్ గా భోగాపురం వ్యవహారం కూడా కలవడంతో పవన్ మరింత మానసిక సంఘర్షణకు లోనవుతున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదావిషయమై వారివారి స్థాయిలో నాయ‌కులు స్పందిస్తూంటే పవన్ కళ్యాణ్ మౌనం వీడడా అని కామెంట్స్ చేస్తున్న నేపధ్యంలో పవన్ పిలుపు కోసం ఆంధ్రప్రదేశ్ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్ధం అవుతుంది.


గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో పోటీచేయడం ద్వారా


సరే, రైతుల సమస్యలు పక్కన పెడదాం. న్యాయస్థానం గ్రేటర్‌ హైద్రాబాద్‌ఎన్నికల్ని డిసెంబర్‌ 16 లోగా ముగించాలని డెడ్‌లైన్‌ పెట్టింది. రానున్నగ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో ప‌వ‌న్ వ్యూహామేంటి.. ఎన్నిక‌ల్లోకిదిగ నున్నాడా లేదా అన్న‌సమాధానం చెప్పకపోవడం మరింత విస్మయం కలిగిస్తోంది.పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ సంవత్సరం క్రితం జనసేన పార్టీని స్థాపించినా,అది రాజకీయ పార్టీగా ఎదగలేదు. గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో పోటీచేయడం ద్వారా జనసేన ఉనికి చాటాలని పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ అనుకుంటున్నారంటూ వార్తలు ఎన్నో వచ్చాయి. కానీ తగిన యంత్రాంగాన్ని తయారుచేసుకోవడంలో పవన్‌కళ్యాణ్‌ విఫలమయ్యారు. సరిగ్గా ఏడు నెలలే సమయం ఉంది. ఈఏడు నెలల్లో జనసేన పార్టీని గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో బలోపేతం చేయడంచాలా కష్టం. డిసెంబర్‌ 16 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వాల్సి వుంది.హైకోర్టు ఈ మేరకు తెలంగాణ సర్కార్‌కి అల్టిమేటం జారీ చేసింది.య‌ధావిధిగానే పవన్‌ బీజేపీ, టీడీపీలకు మద్దతుగా ప్రచారం చేస్తారు తప్ప,గ్రేటర్‌ ఎన్నికల్లో పోటీ చేసేంత సీన్‌ ఆయనకుగానీ, ఆయన పార్టీకిగానీలేదనేది స్ప‌ష్ట‌మౌతోంది. మ‌రోపక్క టీడీపీ మహానాడుకు రావాల్సిందిగాపవన్‌కళ్యాణ్‌కి ఆహ్వానం పంపుతున్నారట.


పవర్ స్టార్ హీరో పవర్ ఎలా వున్నా


పవర్ స్టార్ హీరో పవర్ ఎలా వున్నా, పొలిటికల్ గేమ్ ప‌వ‌ర్ మాత్రం బాగానే ఉంది. రేపోమాపో ప్ర‌శ్నించ‌డం ప్రారంభిస్తారని అధికార తెలుగుదేశంపార్టీ విధానాలు నచ్చనివారో, భోగాపురం లో దారుణంగా భూములుకోల్పోతున్నవారో భావిస్తుంటే, ఆయన మాత్రం, తనకు కావాల్సిన వాళ్లకి పదవులుఇప్పించేపనిలో పడ్డాడు. తిరుపతికి చెందిన హరిప్రసాద్ అనే వ్యక్తికిటీటీడీ బోర్డు మెంబర్ పదవిని చంద్రబాబు కట్ట బెట్టారు. ఇది కేవలం పవన్సిఫార్సు కారణంగానే సాధ్యమైందన్నది రాజకీయ వర్గాల అంచ‌నా.


టోటల్‌గా ఫాన్స్‌ని పవన్‌ గందరగోళంలోకి నెట్టేశాడు


మరింకేం ప్రశ్నిస్తారు పవన్ బాబు. ఆశలు వదులుకోవడం మంచిదేమో? అనుకుంటుంన్నారు భూములు కోల్పోయిన రైతులు. సినిమా సంగతులు తేలక, పొలిటికల్‌ భవితవ్యంపై పవన్‌ స్పష్టత ఇవ్వక.. టోటల్‌గా ఫాన్స్‌ని పవన్‌ గందరగోళంలోకి నెట్టేశాడు. ఎవ్వ‌రికి ఎం చెప్పాలో అర్ధం కాకక‌నప‌డ‌కుండా పోయాడ‌ని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: