తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన పార్లమెంటరీ సెక్రటరీల విధానం చెల్లదంటూ న్యాయస్థానం శుక్రవారం నాడు తీర్పు వెలువరించింది. పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదని కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, టి. టీడీపీ ఎమ్మెల్యే రేవంతర్‌ రెడ్డి వేసిన పిటీషన్‌పై ధర్మాసనం శుక్రవారం నాడు విచారణ చేపట్టింది. పార్లమెంటరీ సెక్రటరీల నియామకం పూర్తిగా చట్ట వ్యతిరేకంగా ఉందని, ప్రజా ధనాన్ని ఇష్టానుసారం ఖర్చు చేయడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్


కోర్టు తీర్పుతో పార్లమెంటరీ సెక్రటరీలుగా బాధ్యతలు చేపట్టిన వినయ్ భాస్కర్, జలగం వెంకట్రావు, గాదరి కిశోర్ కుమార్, సతీశ్ కుమార్, కోవాల లక్ష్మి పదవులు కోల్పోనున్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించిన సంగతి తెలిసిందే. వి. సతీష్ కుమార్ (విద్యాశాఖ), జీ కిషోర్ కుమార్ (వైద్యశాఖ), శ్రీనివాస్గౌడ్ (రెవెన్యూ శాఖ), కోవా లక్ష్మీ (వ్యవసాయ శాఖ), జలగం వెంకట్రావ్, వినయ్ భాస్కర్లకు సీఎం కార్యాలయ శాఖలు కేటాయించారు. వీరికి సహాయ మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  కేసీఆర్‌ తీసుకుంటున్న అన్ని నిర్ణయాలనూ కోర్టులు కొట్టేస్తున్నందున, కేసీఆర్‌ తన వైఖరిని మార్చుకోవాలని, చట్ట విరుద్ధమైన రాజ్యాంగ వ్యతిరేకమైన చర్యలు చేపట్టరాదని రేవంత్‌ ఈ సందర్భంగా హితవు చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: