తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే  రేవంత్ రెడ్డి లంచం కేసులో ఇరుక్కొవడం పెను సంచలనాలకు దారి తీసింది. అయితే ఈ కేసు వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి చంద్రబాబు నాయుడి మెడకు  చుట్టుకోవడం ఖాయమని అందుకోసమే ఈ కేసులో కెసిఆర్ ను మేనేజ్ చేయలేకపోతే ఎపి ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు కాకతప్పదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిది అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.


తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు


మొన్నటి వరకు మహానాడు కార్యక్రమాలు జరుపుకొని పార్టీ నిస్వార్థమైన సేవలు అందిస్తుంది, నిజాయితీకి మారు పేరు అని నీతులు వల్లించిన , విపక్షాలు అవినీతికి మారుపేరుగా అవినీతికి అడ్డాగా మారాయి అని ఆరోపించిన చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎమ్మెల్యే చేసి దిక్కుమాలిన పనికి ఏం సమాధానం చెబుతాడు..? ఈ విషయంలోనే ఆయన పార్టీ వైఖరి, చంద్రబాబు నిజ స్వరూపం ఈ కేసులో బయటపడిందని రాంబాబు అన్నారు. చంద్రబాబు నాయుడు తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఎంత పనైనా చేస్తారని మొత్తానికి ఈ రాజకీయ చదరంగంలో రేవంత్ ని ఒక పాశిక చేశారని అంబటి అభిప్రాయపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: