వ‌స్తువుల త‌యారి కుంపెనీ వారు త‌మ వ‌స్తువు ల‌ను మార్కెట్ లో ప్ర‌వేశ పెట్టాడినికి సెల‌బ్రెటిల‌ను బ్రాడ్ అంబాసిడ‌ర్ గా నియ‌మిస్తారు. వారితో ఆయా వ‌స్తువుల‌ను మార్కెట్లోకి ప్ర‌వేశ పెడ‌తారు. దీంతో వ‌స్తువుల కొనుగోలు పెరుగుంత‌డంతో అన్ని కంపెనీ లు ఇదే మంత్రాన్ని అవ‌లంభిస్తున్నాయి. కాని వీరికి మ్యాగీ నూడుల్స్  కు ప్రచారకర్తలుగా ఉండ‌ట‌మే వారికి శాపంలా మారింది.  బీహార్‌లోని ముజాఫర్‌పూర్‌లోని లెనిన్‌ చౌక్‌లోని ఓ షాపులో కొన్న మ్యాగీ నూడుల్స్ కొని తిన్న ఒక వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో నూడుల్‌‌స తయారీ ప్రమాణాలపై అనుమానాలు తలెత్తాయి. వెంటనే మ్యాగీ నూడుల్స్ తయారీదారులైన నెస్లే కంపెనీపైనా, ఆ ఉత్పత్తిని ప్రచారం చేసిన ముగ్గురు ప్రముఖ బాలివుడ్‌ నటులపైనా కేసు పెట్టారు. భారతీయ శిక్షా సృ్మతిలోని 270, 273, 276, 420 సెక్షన్ల కింద కేసు నమోదైంది. 

నూడుల్స్ తయారు చేసే నెస్లే ఇండియా కంపెనీ తమ ఉత్పత్తులలో


బీహార్‌లోని ముజాఫర్‌పూర్‌ అడిషనల్‌ జుడీషియల్‌ మెజిస్ట్రేట్ లో నెస్లే కంపెనీ ఎండి మోహన్‌ గుప్తా, జాయింట్‌ డైరెక్టర్‌ సబాబ్‌ అలం, బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌, మాధురీ దీక్షిత్‌, ప్రితీజింటాలను బాధ్యులుగా చేయాలంటూ పిటిషన్‌ దాఖలైంది.  మ‌రోవైపు.. ఆ నూడుల్స్ తయారు చేసే నెస్లే ఇండియా కంపెనీ తమ ఉత్పత్తులలో ఎలాంటి లోపాలు లేవని చెబుతోంది. త‌మ‌ సొంత లేబొరెటరీల్లో పరీక్షలు నిర్వహించి ఏలాంటి విష ప‌దార్ధాలు లేవ‌ని తేల్చింది. కామ్యాగీ ఉత్పత్తులపైనే కాకుండా ని ముజాఫర్‌పూర్‌ అడిషనల్‌ జుడీషియల్‌ మెజిస్ట్రేట్ మాత్రం ఈ కంపెనీ అధికారుల‌ను ప్ర‌చార‌క‌ర్త‌లుగా వ్య‌వ‌హ‌రించిన మ‌రో ముగ్గురు బాలీవుడ్‌ స్టార్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఖాజీమహ్మద్‌పూర్‌ పోలీసులను ఆదేశాల‌ను జారి చేసింది.

మ్యాగీ నూడుల్స్ నిషేధించే దిశగా చర్యలు తీసుకోబోతున్నాయి


అంతేకాకుండా వారిని అరెస్టు చేసి కేసు దర్యాప్తును చేపట్టాలని న్యాయమూర్తి  పోలీసుల‌కు సూచించారు. దేశవ్యాప్తంగా ప్రముఖ నటులపై కేసు అంశం చర్చనీయాంశంగా మారింది.దీని పై స్పందించిన కేంద్ర ప్ర‌భుత్వం దేశవ్యాప్తంగా మ్యాగీ అమ్మకాలపై నిషేధం విధించినట్లు కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్ తెలిపారు. అంతేకాకుండా న్యూడిల్స్ పై పరీక్షలు నిర్వహించాలని కోరుతూ ఎఫ్‌డీఐ అన్ని రాష్ట్రాల‌ ప్రభుత్వాలకు లేఖ రాసింది. ఈ వ్య‌వ‌హ‌రం పై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, బాధ్యులెవరైనా శిక్ష తప్పదని హెచ్చరించారు.ఇక నిత్యావసర వస్తువుల త‌యారి పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం యోచిస్తోంది, ఆహారపదార్థాల కల్తీని నియంత్రించేందుకు నూతన చట్టాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు  కూడా కేంద్ర మంత్రి స్ప‌ష్టం చేశారు. ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు మ్యాగీ నూడుల్స్ నిషేధించే దిశగా చర్యలు తీసుకోబోతున్నాయి. ఇప్ప‌టీకే చాలా రాష్ట్రాలు న్యూడుల్స్ నమూనాలు సేకరించి లేబొరెటరీలకు పంపారు. మ్యాగీని ఆహారంగా తీసుకోవడం హానికరమని, వాటిలో సీసం శాతం ఎక్కువగా ఉందని చాలా రాష్ట్రాల్లో నివేదికలు వస్తున్నాయి.

మ్యాగీ నూడుల్స్ అమ్మకాల సంగతి ప‌క్క‌న పెడితే


మ్యాగీ నూడుల్స్ అమ్మకాల సంగతి ప‌క్క‌న పెడితే, ఈ వ్య‌వ‌హ‌రం తో ఇక వాణిజ్య ప్రకటనల్లో సినీ ప్రముఖులు నటించేందుకు వెన‌క‌డుగు వేసే పరిస్థితి ఏర్ప‌డింది. ఉత్పత్తులలో లోపాలకు బ్రాండ్‌ అంబాసిడర్లను ఏలా బాధ్యులౌతార‌ని మేధావులు ప్రశ్నిస్తున్నారు. కాని  బీహార్‌లోని ముజాఫర్‌పూర్‌ అడిషనల్‌ జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ రామ్‌చంద్ర ప్రసాద్, మ్యాగీ నూడుల్స్ ప్రచారకర్తలను కూడా వస్తువు నాణ్యతలో భాగస్వాములను చేస్తూ నోటీసులు జారీ చేశారు. వారిని అనవసరంగా వివాదంలోకి లాగుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. రెండు నిముషాల్లో సిద్ధమయ్యే ఆహారం మ్యాగీ. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఆహారం మ్యాగీ జంక్‌ ఫుడ్‌ అయినా సరే తక్కువ పరిమాణంలో తింటే ఇబ్బందేమీ లేదని భావించిన ఆహారం మ్యాగీ. అయితే ఈ అభిప్రాయం రెండు రోజుల్లో మారిపోయింది.

అలాంటప్పుడు బ్రాండ్‌ అంబాసిడర్లను బాధ్యులను ఎలా చేస్తారనేది ప్రశ్న


కంపెనీ వస్తువులను ఏ విధంగా ప్రచారంచేయాలో  కంపెనీలు మాత్ర‌మే నిర్ణయిస్తాయి. వస్తువుల తయారీ కూడా కంపెనీలు చేస్తాయి. కానీ బ్రాండ్‌ అంబాసిడర్లు ఏలాంటి సంబందం ఉండ‌దు. వివిధ రకాల ఉత్పత్తులు చేసే కంపెనీలు బ్రాండ్‌ అంబాసిడర్లకు తమ ఉత్పత్తుల వివరాలు తెలిపే అవకాశం లేదు. ప‌దార్ధాలు త‌యారిలో వాడే ముడిప‌దార్ధాలు గోప్యంగా ఉంచుతారు. కేంద్ర ప్ర‌భుత్వాల నిబంద‌న‌ల ప్ర‌కారం  ఏదైనా కంపెనీ తాను తాయారు చేసే పద్ధతులు, విధానం, వాడుతున్న పదార్ధాలను ప్రభుత్వ సంస్థకు వెల్లడిస్తుంది తప్ప మరెవరికి చెప్పకూడ‌దు. కంపెనీకి ఏలాంటి సంబంద లేని బ్రాండ్‌ అంబాసిడర్‌కు తయారీ విధానాన్ని, వాడుతున్న పదార్ధాన్ని వెల్లడించదు. అలాంటప్పుడు బ్రాండ్‌ అంబాసిడర్లను బాధ్యులను ఎలా చేస్తారనేది ప్రశ్న. 


ప్యాకెట్‌పై ఉన్న మోతాదుకు పదార్ధంలో ఉన్న మోతాదుకు వ్యత్యాసం ఉంటే ప్రమాణాల సంస్థలు చర్యలు తీసుకోవాలి. ఆహార పదార్ధాల తయారీదారుల కంపెని ల విష‌యంలో యుపిఏ ప్రభుత్వ హయాంలో  నుంచి పకడ్బందిగా నిబంధనలు రూపొందించారు. వాటి ఉల్లంఘించిన వారిపై కఠినమైన శిక్షలు కూడా ఉన్నాయి. చట్ట ప్రకారం సంబంధిత కంపెనీ వ్యక్తులపై చర్య తీసుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అంతేకాని కంపెనీ ల‌కు ఎలాంటి సంబంధం లేని  బ్రాండ్‌ అంబాసిడర్ల‌ను బాద్యుల‌ను చేసి వారి పై కూడా కేసులు పెట్టడం పై స‌ర్వ‌త్రా విమ‌ర్ష‌లు వెల్లు వెత్తుతున్నాయి. చ‌ట్టం ప్ర‌కారం త‌ప్పు త‌ప్పే. తప్పు చేసిన వారిని క్ష‌మించరాదు. కాని అణ్యం పుణ్యం తెలియ‌ని వారిని దోషుల‌ను చేయ‌టం స‌రికాదు.


మరింత సమాచారం తెలుసుకోండి: