రాజకీయ నాయకులంటే.. ఎప్పుడు విమర్శలు, ప్రతివిమర్శలు.. దాడులు, వ్యూహాలు.. వారి సగం జీవితంలో వీటితోనే సరిపోతుంది. కానీ వారికీ కొన్ని హాబీలుంటాయి. అందరిలాగే వారికీ కొన్ని అభిరుచులుంటాయి. ప్రత్యేకించి ఎంత రాజకీయ నాయకుడైనా సినిమాల విషయానికి వచ్చేసరికి సగటు అభిమానిగా మారిపోతుంటారు. 

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా.. ఆయన తెలుగు సినీ హీరోలపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.  సోషల్‌మీడియా వెబ్‌సైట్ ట్విట్టర్లో శుక్రవారం సాయంత్రం ఆయన నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. @WeAreHyderabad, #AskKTR హ్యాష్ ట్యాగ్‌ను ఏర్పాటుచేశారు. ఇందులో కొందరు సినిమాల గురించి కేటీఆర్ ను ప్రశ్నలు అడిగారు. 

కేటీఆర్ ఫేవరేట్ డైరెక్టర్.. రాజమౌళి.. 


తెలంగాణ యువకులు చాలా మంది కేటీఆర్ ను అభిమానిస్తుంటారు. మరి మీరు అభిమానించే నటుడు ఎవరు అని నెటిజన్ కేటీఆర్ ను ఇరుకునపెట్టాడు. దాంతో కాస్త తటపటాయించిన కేటీఆర్. ఏ ఒక్కరి పేరో చెప్పుకుండా తన తెలివితేటలు ఉపయోగించారు. తనకు చాలామంది అభిమానులున్నారన్న కేటీఆర్ వారిలో మహేశ్‌బాబు, రాంచరణ్ తేజ్, ఎన్టీఆర్ ఉన్నారని చెప్పారు. 

తాను సినిమా ప్రియుడినని, ఎస్‌ఎస్ రాజమౌళి అద్భుతమైన దర్శకుడని కేటీఆర్ స్పందించారు. పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి అనేక ట్వీట్లు వస్తున్నాయి.. ఆయనపై మీ అభిప్రాయం ఏంటని ఓ పవన్ అభిమాని ప్రశ్నించాడు. పవన్ కల్యాణ్ మంచి నటుడని.. నటుడిగా ఆయనను అభిమానిస్తానని కేటీఆర్ అన్నారు. పవన్ పై పొలిటికల్ కామెంట్లేవీ చేయలేదు. సినీ పరిశ్రమను పట్టించుకోవాలని ఓ యువకుడు కోరగా.. ఇందుకు తగిన ప్రణాళికలున్నాయని కేటీఆర్ సమాధానమిచ్చారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: