ముఖ్యమంత్రి కేసీఆర్ కోతులపై చెప్పిన కథ అదిరిపోయింది. ఇంతకీ మ్యాటర్ ఏంటీ అంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఎంతో వైభవంగా ప్రారంభించిన హరితహారాన్ని రెండో రోజు కూడా కొనసాగించారు. అయితే రెండో రోజు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో అడవుల పెంపకం మీద ఎలా ముందుకు వెళ్లాలో వివరించారు. చెట్లు నాటాలని సీఎం చెప్పాలా అని ప్ర్రశ్నించారు. చెట్లు నాటితేనే వానలు వస్తాయి.

కోతులు  వెనక్కి పోవాలంటే !


కోతులు  వెనక్కి పోవాలంటే అడవుల విస్తీర్ణం పెంచాలి. అప్పుడే కోతులు, కోనెంగల వెనక్కిపోవడం సాధ్యమవుతుంది. ఇక ఇప్పుడు ఎవర్నీ అడుక్కునే పరిస్థితి లేదు.. వానలు రమ్మంటే రావాలి. కోతులు పొమ్మంటే పోవాలి. హరితహారం ఒక్కరితో విజయవంతం కాదు.. ప్రతి గ్రామంలోని ప్రతి వ్యక్తి హరితహారంలో పాల్గొంటేనే తెలంగాణ పచ్చగా తయారవుతుందన్నారు. అయితే ఇలా హరితహారం గురించి వివరించే క్రమంలో కేసీఆర్ కోతుల కథను వివరించారు. ఓ ఊర్లో చాలా కోతులు ఉన్నాయట.. అయితే కోతులను హనుమంతుడి రూపాలుగా భావించడం వల్ల ఎవరూ కూడా కొట్టరు. మరి అలాంటప్పుడు కోతుల బెడద తప్పించుకోవడానికి కొండముచ్చులను తీసుకువచ్చారట. అయితే కోతులన్నీ ఏకమై ఓ మీటింగ్ పెట్టుకున్నయంట.. అన్నీ కలిసి విప్లవం జిందాబాద్ అనుకున్నయట. తర్వాత మనం వంద మంది ఉన్నాం. ఆ కొండముచ్చును తరమలేమా అని అనుకున్నాయట. అలా మొత్తానికి చాలా ఊర్లలో కొండముచ్చులే కోతులను వెళ్లగొడుతున్నాయట. మొత్తానికి కేసీఆర్ చెప్పిన కథతో సభలో నవ్వులు పూసాయి. చివరకు అడవులు బాగా పెంచితే కోతులు అడవులు పోయి.. వర్షాలు కూడా కురుస్తాయి అని వివరించారు.(Source)


మరింత సమాచారం తెలుసుకోండి: