తెలుగుదేశం పార్టీ నాయకుల ధోరణి మరీ చిత్రంగా కనిపిస్తోంది. లిబియాలో తెలుగు ప్రాంతానికి చెదిన ఇద్దరు వ్యక్తులు ఐసిస్‌ ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వారు క్షేమంగా వస్తున్నారో లేదో, వారికి ఏదైనా ప్రాణాపాయం సంభవించిందో ఏమో అని వారి కుటుంబసభ్యులు ఇక్కడ తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉంటే.. తెదేపా ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు మాత్రం.. వారు విడుదల అయ్యారు అని.. ఒక మాట చెప్పేసి.. వారికోసం చంద్రబాబునాయుడు ఎంతో తపన పడిపోతున్నారంటూ.. ఆయనను పొగడానికి పరిమితం అవుతున్నారు. ఒకవైపు తమ వారి క్షేమం గురించి ఆందోళన చెందుతున్న కుటుంబాల వారికి భరోసా ఇవ్వడం కంటె.. చంద్రబాబుకు భజన చేయడమే ప్రయారిటీగా ఉన్నట్లు కనిపిస్తోంది. 


లిబియాలో నలుగురు భారతీయులు ఐసిస్‌ చెరలో చిక్కుకకున్న సంగతి తెలిసిందే. వీరిలో ఇద్దరు విడుదల అయి కర్నాటకలోని తమ స్వస్థలాలకు చేరుకున్నారు. ఇద్దరు తెలుగు వారు గోపీకృష్ఱ, బలరాం మాత్రం ఇంకా వారి చెరలోనే ఉన్నారు. వారి క్షేమం గురించి తెలుగురాష్ట్రాల్లోని వారి కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. 


అయితే వీరికి సంబంధించి వీరు కూడా విడుదల అయ్యారంటూ బుధవారం నాడు పుకార్లు వచ్చాయి. తెలుగుదేశం ఎంపీ, కంభంపాటి రామ్మోహన్‌ ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. అయితే లిబియాలోని నిర్బంధంలో ఉన్న వారు విడుదల అయినట్లుగా.. విదేశాంగ శాఖ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. వారు క్షేమంగా విడుదల కావడం శుభపరిణామం అని.. మరికొన్ని రోజుల్లో వారిని స్వదేశానికి తీసుకువస్తాం అని కంభంపాటి అన్నారు. అయితే అధికారిక ప్రకటన రాకపోవడం కుంటుంబ సభ్యులకు ఇప్పటికీ ఆందోళనగానే ఉంది.

కంభంపాటి మాత్రం.. ఈ సందర్భంగా తమ పార్టీ నేత చంద్రబాబుకు చిడతలు వాయిచండానికే ఎక్కువ సమయం కేటాయించారు. చంద్రబాబు.. ప్రస్తుతం విహారయాత్రలో టర్కీలో ఉంటే.. అక్కడినుంచి తమ సీఎం పదేపదే ఫాలో అప్‌ చేస్తున్నారని.. లిబియాలోని వారి విడుదలకు చర్యలు తీసుకుంటున్నారని.. కంభంపాటి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆయన ఆరాటం మొత్తం చంద్రబాబు శ్రద్ధ గురించి భజన చేయడమే తప్ప.. బాధితుల్ని ఊరడించడం లాగా కనిపించడం లేదు. విదేశాంగ శాఖనుంచి అధికారిక ప్రకటన తెప్పించడంపై ఆయన శ్రద్ధ పెట్టలేదనే విమర్శలు వస్తున్నాయి. కనీసం లిబియానుంచి విడుదల అయ్యారని అంటున్నారే తప్ప.. ఎప్పుడు తీసుకువస్తామో తేల్చడం లేదు. మరికొన్నిరోజుల్లో అంటున్నారు. ఏదేమైనప్పటికీ.. విడుదల అయ్యారని అంటున్న తెలుగు వారిని తక్షణం స్వదేశానికి తీసుకురావడానికి కంభంపాటి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: