గ‌త రెండు వారాలు గా లోక్ స‌భలో ల‌లిత్ గేట్ వ్య‌వ‌హారం చాలావాడివేడి నిర‌స‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి ప‌క్షం కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఈ వ్య‌వ‌హారంలో ఆరోప‌ణ‌లు ఎదురుకుంటున్న కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మ‌స్వ‌రాజ్, రాజ‌స్థాన్ సీఎం వ‌సుంధ‌ర రాజే లు రాజీనామా చేస్తే గాని మేము ఈ చ‌ర్చ‌లకు స‌హ‌క‌రిస్తామ‌ని చెబుతూ వ‌స్తున్నారు. మ‌రోవైపు అధికార బీజేపీ పార్టీ ల‌లిత్ గేట్ వ్య‌వ‌హారం పై సంజాయిషి ఇస్తామ‌ని, రాజీనామా మాత్రం చేసే ప్ర‌సక్తే లేద‌ని వాదిస్తూ వ‌స్తున్నారు. సుష్మ అభిప్రాయం ప‌డినట్టు పార్ల‌మెంట్ లో ఈ విష‌యం పై అర్థ‌వంత‌మైన చ‌ర్చ జ‌ర‌గ‌వ‌ల‌సిందే. గ‌తంలో కాంగ్రెస్ పార్టీ అదికారంలో ఉండి బీజేపీ ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు పార్ల‌మెంట్ స‌మావేశాల‌ను జ‌ర‌గ‌కుండా అనేక సార్లు అడ్డుపడింది. జీజేపీ పై ప్ర‌తీకార చ‌ర్య‌తో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే ప‌ని చేస్తున్న‌ది. దీని వ‌ల్ల ఇన్ని ద‌శాబ్దాలుగా కాపాడుకుంటూ వ‌చ్చిన పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌స్థ నిర‌ర్థ‌క‌మైపోయే ప్ర‌మాదం ఏర్ప‌డింది.

పార్ల‌మెంటు స‌మావేశాలు 


రాజ‌కీయ నాయకులు నైతిక విలువ‌లు పాటించాల‌నే ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు.ల‌లిత్ మోడీ కి తోడ్పాటు అందించిన ఉదంతంలో త‌న చ‌ర్య‌ను స‌మ‌ర్థిచుకుంటూ విదేశాంగ మంత్రి సుష్మాస్వ‌రాజ్ లోక్ స‌భ‌లో చేసిన ప్ర‌సంగం ఉద్వేగ‌భ‌రితంగా ఉంది. పార్టీలో అగ్ర‌శ్రేణి నేత అయిన త‌న పై ఆరోప‌ణ‌లు రావ‌డం ఆమెను క‌లిచివేసిన‌ట్టుంది. దీనికి తోడు ప్ర‌తిపక్షాలు తాను రాజీనామా చేయాలంటూ ప‌ట్టుద‌ల‌గా పార్ల‌మెంటును స్తంభింప చేస్తుండ‌డంతో ఆమె ఉద్వేగానికి గుర‌య్యారు. పార్ల‌మెంటు స‌మావేశాలు ప్రారంభ‌మైన నాటి నుంచి త‌న వాద‌న వినిపించుకోవ‌డానికి అవకాశం ఇవ్వాల‌ని కోరుతున్నాన‌నీ, కానీ ప్ర‌తిప‌క్షంలోని మిత్రులు త‌న‌కు వాద‌న వినిపించే అవ‌కాశం కూడా ఇవ్వ‌కుండా రాజీనామాకు ప‌ట్టుప‌డుతున్నార‌ని ఆమె అన్నారు. ప్ర‌సంగంలోని అంశాల మాట ఎలా ఉన్నా ఆమెకు క‌నీసం త‌న వాద‌న వినిపించుకునే అవ‌కాశం ఇవ్వాల్సిందే. పార్ల‌మెంటు లోప‌ల‌, బ‌య‌ట త‌న‌కు దోషిగా నిల‌బెట్టిన‌ప్పుడు ఆమెపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఆమె చెప్పే విష‌యాల‌తో ప్ర‌తిప‌క్షం ఏకీభ‌వించ‌క పోవ‌చ్చు.ఆమె సంజాయిషీ ఆమోదయోగ్యంగా లేకపోతే ప్రతిపక్షాలు సభలో అదే విషయం చెప్పవచ్చు.


పార్లమెంటు లో ఆమె చెప్పిన అంశాలపై చర్చించుకునే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. సుష్మాస్వరాజ్ త‌న ప్ర‌స‌సంగంలో నేను చేసిన నేర‌మేమిటి? అని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌లు న‌న్ను అడుగుతున్నారు. ఎట్లా చేశారు, ఎందుకు చేశావు? అని ఇంత‌కూ నేను చేసిందేమిటి? ల‌లిత్ మోడీకి ఆర్థిక లబ్ధి చేకూర్చానా? ప‌్ర‌యాణ అనుమ‌తి పత్రాలు పొంద‌డానికి తోడ్ప‌డ్డానా? నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం యూకే ప్ర‌భుత్వానికి వ‌దిలిపెట్టాను. మాన‌వ‌తా దృక్ప‌థంతో మాత్ర‌మే సందేశం ఇచ్చారు అని సుష్మాస్వ‌రాజ్ అన్నారు. తాను తోడ్ప‌డింది ల‌లిత్ మోడీ కి కాదు, ఆయ‌న భార్య‌కు అనేది సుష్మాస్వ‌రాజ్ చెప్ప‌క‌నే చెప్పింది. ఈ విష‌యంలో సుష్మాస్వ‌రాజ్ అందించిన తోడ్పాటు నైతికం గా స‌మ‌ర్థ‌నీయం కాదు. ఆమె వాద‌న హేతుబ‌ద్దంగా కూడా లేదు. సుష్మాస్వరాజ్ కుటుంబానికి, ల‌లిత్ మోడీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సుష్మ భ‌ర్త బిడ్డ న్యాయ‌వాదులుగా ల‌లిత్ మోడీ సంస్థ నుంచి ల‌బ్ధి పొందుతున్నారు.

ల‌లిత్ మోడీ అక్ర‌మ లావాదేవీ 


ల‌లిత్ మోడీ అక్ర‌మ లావాదేవీ ల సంబంధించిన ద‌ర్యాప్తు నుంచి త‌ప్పించుకోని బ్రిట‌న్ లో త‌ల‌దాచుకున్నారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర మంత్రి గా ఉన్న సుష్మా స్వ‌రాజ్ స్వీయ ప్ర‌యోజ‌నాల మూలంగా అధికార హోదాకు భంగం వాటిల్ల‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి. ల‌లిత్ మోడీ భార్య పోర్చుగ‌ల్ లో క్యాన్సర్ కు చికిత్స పొందుతున్నార‌నేది వాస్త‌వ‌మే. ప్రాణాంత‌క వ్యాధికి చికిత్స పొందుతున్న‌ప్పుడు ఆమె భ‌ర్త త‌న ద‌గ్గ‌ర ఉండాల‌ని కోరుకుంటుంది. ల‌లిత్ మోడీ ని దేశం విడిచి వెళ్ల‌డానికి అనుమ‌తి ఇస్తే, ఆ కార‌ణంగా రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు దెబ్బ‌తిన‌బోవ‌ని సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రి హోదాలో బ్రిటిష్ అధికారుల‌కు సందేశం పంపారు. ల‌లిత్ మోడీ కోరిక మేర‌కు మానవ‌తా దృక్ప‌థంతో ఈ సందేశం పంపించాన‌ని, త‌న స్థానం లో సోనియాగాంధీ ఉంటే ఈ విధంగా చేసే వారు కాదా? ల‌లిత్ మోడీ భార్య‌ను అట్లాగే మ‌ర‌ణించ‌నివ్వాలా? అని సుష్మా ప్ర‌శ్నించారు.కేంద్ర మంత్రిగా ఈ పని సుష్మ చేసినా, ఆమె స్థానంలో సోనియా ఉండి చేసినా స‌మ‌ర్ధ‌నీయం కాదు. త‌న కుటుంబానికి ఆర్థిక లావాదేవీలు లేక‌పోతే మాన‌వ‌తా దృక్ప‌థం వ‌ర్తిస్తుంది. కేంద్ర మంత్రి స్థానం లో ఉండి, విదేశాంగ శాఖ అదికారుల‌ను, దౌత్య వేత్త‌ల‌ను ప‌క్క‌న పెట్టి సీదాగా బ్రిట‌న్ అధికారుల‌కు ఈ సూచ‌న చేయ‌డం, అదీ నేర‌స్తుడికి తోడ్ప‌డ‌టం ఏ విధంగా చూసినా తప్పే. ఇదే మాన‌వ‌తా సూత్ర స్థిర‌ప‌డితే రాజ‌కీయ నాయ‌కులంతా త‌మ స‌న్నిహితుల‌కు అనేక విధాలుగా తోడ్పాటు అందించుకోవ‌చ్చు! వ‌చ్చే వారం కాంగ్రెస్ పార్టీ ఎంపీల స‌స్పెన్ష‌న్ ముగుస్తుంది. క‌నుక‌, అప్పుడు(త‌న‌పై ఆరోప‌ణ‌లు, త‌న స‌మాధానంపై)చ‌ర్చ కొన‌సాగుతుంద‌నే ఆశాభావాన్ని సుష్మాస్వ‌రాజ్ వెలిబుచ్చారు. సుష్మా అభిప్రాయ ప‌డిన‌ట్టు పార్ల‌మెంటు లో ఈ విష‌యమై అర్ధ‌వంత‌మైన చ‌ర్చ జ‌ర‌గ‌వ‌ల‌సిందే.  


 రాజ‌కీయ నాయ‌కులు నైతిక విలువ‌లు పాటించాల‌నే ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. కానీ లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి మాదిరిగా రాజీనామాలు చేసినవారున్నారు. ఎన్నిఆరోప‌ణ‌లు వ‌చ్చినా ప‌ద‌వులు ప‌ట్టుకొని వేలాడే వారూ ఉన్నారు. నైతిక విలువ‌ల‌ను ప్ర‌తిష్ఠించాల‌నే కార‌ణాన్ని చూపి సుస్థిరంగా ఉన్నా పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌స్థ‌ను బ‌ల‌హీన‌ప‌ర‌చ‌కూడదు. మోడీ ప్ర‌భుత్వం కూడా స‌భ్యుల ఆకాంక్ష‌లు ప‌ట్టించుకొని ప‌రిష్క‌రించ‌డం అల‌వ‌ర‌చుకోవాలి. ఎంపీలు రోజుల కొద్దీ గొడ‌వ చేసినా ప‌ట్టించుకోక‌పోవ‌డం మంచిదికాదు. ల‌లిత్ మోడీ వ్య‌వ‌హారంలో తాజాగా ఎంపీ లు చేస్తున్న నిర‌స‌న‌లు ముగింపు ప‌లికి లలిత్ మోడీ వ్య‌వ‌హారం పై చ‌ర్చ జ‌రుగుతుంద‌ని ఆశ్శిద్దాం...  

మరింత సమాచారం తెలుసుకోండి: