‘బ‌చావో తెలంగాణ’ నాగం మరియు ఎన్నం లు కలిసి పెట్టబోతున్న కొత్త వేదిక, తెలంగాణ‌లో మ‌రో ఉద్య‌మ వేదిక పురుడు పోసుకోనుంది. బీజేపీ నేత నాగం జ‌నార్ధ‌న్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీ‌నివాస్ రెడ్డిల ఆధ్వ‌ర్యంలో ‘బ‌చావో తెలంగాణ’ ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిసింది. తెలంగాణ లో దీర్ఘ  కాలంగా పరిష్కారానికి నోచుకోలేని సమస్యల మీద పోరాటం చెయ్యాలని వీరి వేదిక లక్షం అని చెపుతున్నారు .


కానీ ఇటివల తెలంగాణ BJP లో జరుగుతున్న పరిణామాల వల్ల వీళ్ళు అక్కడ పోసగలేక పార్టీని వీడి వేరు కుంపటి పెట్టుకుంటున్నారు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు, రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డితో నాగంకు అంత‌గా పొస‌గ‌డం లేదు. త‌న‌కు పార్టీలో స‌రైన ప్రాధాన్యం ద‌క్క‌డం లేద‌ని ఆయ‌న కొంత‌కాలంగా పార్టీ కార్యాల‌యానికే రావ‌డం మానేశారు. ఇటీవ‌ల బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డి పాల‌మూరు ప‌ర్య‌ట‌న చేప‌ట్టినా.. నాగం వ‌ర్గం దూరంగా ఉన్నది.


నాగం జనార్ధన్ రెడ్డి TDP లో ఒక వెలుగు వెలిగారు మంత్రి


ఒకాప్పుడు నాగం జనార్ధన్ రెడ్డి TDP లో ఒక వెలుగు వెలిగారు మంత్రిగా కూడా పనిచేసారు రాష్ట్ర విభజన అంశం తెరపైకి వచ్చినప్పుడు ఆయన పార్టీ తో విభేదించి బయటకు వచ్చి కాంగ్రేస్ లో చేరడం మనసొప్పక తెరాస లో సరైన స్థానం దొరకదు అనే ఉద్దేశం తో "తెలంగాణ నగారా " పెట్టుకున్నారు తర్వాత దాన్ని నడపలేక BJP లో విలీనం చేసారు. 2014 ఎన్నికలలోమహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి BJP తరుపున పోటి చేసి ఓడిపోయారు.


సగటు తెలంగాణ పౌరుడు మాత్రం దీని గురించి ఇలా అనుకుంటున్నాడు, నాగం మరియు ఎన్నం లు ఇద్దరు  ఈ వేదిక పెట్టడం కరక్టే ఎట్లా అంటే వీరిద్దరు ఇప్పుడు BJP పార్టీ లోనే ఉన్నారు వారికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మీద చూపుతున్న వివక్ష బాగా కనబడుతున్నది, కాబట్టి వీరు ఈ వేదిక ద్వారా కేంద్ర ప్రభుత్వ వివక్షనుంచి తెలంగాణను కాపాడటానికి కేంద్రం మీద పోరాటం చెయ్యాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: