ముఖ్యమంత్రులు, మంత్రుల కుమారులు కూడా పరిపాలన వ్యవహారాల్లో చేతులు పెట్టడం.. అధికారులపై పెత్తనం చేయడం సాధారణమైపోయింది. అందులోనూ ఆ కుర్రనాయకుడు పార్టీలోనూ ముఖ్యపాత్ర పోషించేవాడైతే.. ఆ జోరు ఇంకాస్త ఎక్కువే ఉంటుంది. అందుకు మన లోకేశ్ బాబే ఓ ఉదాహరణ. ఈ టర్మ్ తో పొలిటికల్ గా రిటైరైపోయి.. తనయుడికి పార్టీ పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు ఇప్పటికే డిసైడయ్యారన్నది విశ్లేషకుల అంచనా. 

లోకేశ్ కూడా చురుగ్గానే అటు పార్టీ వ్యవహారాల్లోనూ... ఇటు పాలనావ్యవహారాల్లోనూ దూకుడుగా వెళ్తున్నారు. పేరుకు కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ మాత్రమే అయినా ఆయన పార్టీలో చంద్రబాబు తర్వాత నెంబర్ 2 అన్నది బహిరంగ రహస్యమే. అధికారుల నియామకాల్లోనూ, బదిలీల్లోనూ లోకేశ్ కీ రోల్ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంటుగా జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న కోపంతో.. రమణారెడ్డి అనే ఓ అధికారిని కీలక బాధ్యతల నుంచి తప్పించినట్టు ఓ ఇంగ్లీష్ కథనం పేపర్ రాసింది. 

అసలేంజరిగిందంటే.. ఎన్వీ రమణారెడ్డి అనే అధికారి ప్రోటోకాల్, సమాచార శాఖలోను కీలక బాద్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి దగ్గర సన్నిహితంగా పనిచేశారీ రమణారెడ్డి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రమణారెడ్డీ హవా ఏమాత్రం తగ్గలేదు. ఐతే.. రీసెంటుగా ఢిల్లీలో జగన్ ధర్నా చేసినప్పుడు.. జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఏపీ భవన్ లో పెద్దఎత్తున గదులు కేటాయించారట. ఇందుకోసం రమణారెడ్డి తన పలుకుబడి ఉపయోగించారట. 

దీనిపై సమాచారం అందుకున్న లోకేశ్... రమణారెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారుట. రమణారెడ్డి రైల్వేశాఖ నుంచి డిప్యూటేషన్ పై ఇక్కడకు వచ్చారు. ఐతే.. అలా రప్పించుకున్నవారి డిప్యుటేషన్ పొడిగించడం వెరీ కామన్. కానీ.. జగన్ కు హెల్ప్ చేశాడన్న కారణంతో రమణారెడ్డి లోకేశ్ ఆగ్రహానికి కారణమయ్యారు. అంతే ఆయన డిప్యూటేషన్ పొడిగంచకుండా ఆపేశారట. అధినేతల మనసు తెలుసుకోకుండా... వారికి వ్యతిరేకంగా పనిచేస్తే పర్యవసనాలు ఇలాగే ఉంటాయన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: