ఈ మద్య పాపులారిటీ కోసం ఎన్నో రకాలుగా తంటాలు పడుతున్నారు. అభిమానం సంపాదించడం అంటే అంత సులువైన పనికాదు దానికి కూడా కొన్ని రకాలు ప్రయోగాలు చేయాల్సిందే..  తాజాగా సినిమా ఇండస్ట్రీలో చూస్తూ బాహుబలి క్రియేట్ చేసిన ట్రెండ్ ఏ రేంజ్ కి వెళ్లిందో అందరికీ తెలుసు సోషల్ మీడియాన్ తన ప్రచార సాధనంగా చేసుకొని బాహుబలి మంచి హైక్ సంపాదించుకుంది ఇదే బాటలో మిగతా సినిమాలు కూడా నడవాలనుకుంటున్నాయి.

ఇక రాజకీయంగా చూస్తే నిన్న పవన్ కళ్యాన సృష్టించిన సునామీ చూస్తే అందరికీ ఆశ్చరం కలిగింది. రాజధాని గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత వచ్చిన రెస్పాన్స్ ను చూసి అందరూ అవాక్కయ్యారు. అయితే అదే అభిమానం తమ మీద కూడా చూపిస్తారని అనుకుంటున్నారో ఏమో కానీ తాజాగా మరో నేత కూడా అక్కడికి పర్యటనకు వెళుతున్నారు. ఇక పవన్ కు వచ్చిన రెస్పాన్స్ అయనపై గ్రామస్తులు కురిపించిన అభిమానానికి వైఎస్ జగన్ ఫిదా అయ్యాడు. ఇక పవన్ బాటలో వెళితే మంచి సక్సెస్ సాధించ వచ్చని భావించాడో ఏమో కానీ వైఎస్సార్ పార్టీ తరుపునుంచి రాజధాని భూ బాధితులను పలకరించడానికి రెడీ అయ్యారు.


తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ తన పర్యటనలతో, ఓదార్పు యాత్రలతో బోర్ కొట్టించిన జగన్ తాజాగా పవన్ బాటలో నడవాలని డిసైడ్ అయ్యారు. రాజ‌ధాని కోసం రైతుల అనుమ‌తి లేకుండా  భూములు సేక‌రించ‌డాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జగన్‌ సీఆర్‌డీఏ పరిధిలో ధర్నాకు రెఢీ అయ్యారు. మరోవైపు... రాష్ట్రంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాటం లేదని ఆరోపిస్తోంది వైసీపీ. ఈ నెల 25, 26న వరుస ధర్నాలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని భావిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: