భారతీయ సంప్రదాయాల్లో ముఖ్యమైనది వివాహ బంధం.. ఇరు వైపుల పెద్దలు అంగీకరించి తమ పిల్లలను ఒక్కటి చేసి జీవితాంతం సుఖంగా ఉండాలని దీవిస్తూ.. ఆడ,మగను జత చేస్తారు. అనాది కాలం నుంచి ఈ వివాహ బంధానికి ఎంతో గౌరవ ఇస్తారు.. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్లీ అనే రెండు అక్షరాలతో ఒక్కటౌతారు.. జీవితాంతం కలిసి మెలిసి ఉంటామని ఏడు అడుగులు వేస్తారు.. పెళ్లి అయ్యేంత వరకు తల్లిదండ్రుల వద్ద ముద్దుగా పెరిగిన అమ్మాయి పెళ్లి బంధంతో భర్త ను నమ్ముకొని అత్తారింటికి అడుగు పెడుగుపెడుతుంది.. భారత స్త్రీ పుట్టినింటికి.. మెట్టినింటికి పేరు తీసుకు వస్తుంది. అలా వివాహ బంధంతో నమ్మి వచ్చిన భార్యను అనుమానంతో గొంతు నులిమి అతి కిరాతకంగా చంపేశాడు ఓ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్..కానీ చేసిన నేరం దాగదు..గురువారం వికారాబాద్ అడవికి వెళ్లిన నారాయణగూడ పోలీసులు, సుప్రియ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

రామకృష్ణను అరెస్టు చేసి జైలుకు తరలించారు. కాగా, హత్యకు అతనికి శారీరకలోపం ఉండటమే కారణమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఈ కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్ రామకృష్ణకు సహకరించిన అతడి స్నేహితుడు ప్రదీప్ను అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణ భార్యను హత్యచేసి వికారాబాద్ అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టిన విషయం తెలిసిందే.

జాతీయస్థాయిలో షీనా బోరా హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. షీనాను తల్లి హత్య ఇంద్రాణి హత్య చేసి అడవుల్లో పాతిపెట్టింది. ఇక్కడ రామకృష్ణ కూడా హత్య చేసి భార్యను వికారాబాద్ అడవుల్లో పాతిపట్టాడు. రామకృష్ణను అరెస్టు చేసి జైలుకు తరలించారు. మరోవైపు తమ కుమార్తెను హతమార్చిన రామకృష్ణను ఉరి తీయాలని సుప్రియ కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. నమ్మించి ప్రాణం తీసిన రామకృష్ణకు కఠినంగా శిక్షించాలని ముక్తకంఠంతో డిమాండ్‌ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: