భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటీష్ వారికి ముచ్చెమటలు పోయించిన మహనేత  నేతాజీ సుభాష్ చంద్రబోస్. అయితే భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈయన మరణం ఒక మిస్టరీగా మారిపోయింది.. అయితే బ్రిటీష్ ప్రభుత్వం నేతాజీపై ఎన్నో కేసులు పెట్టింది. బ్రిటీష్ ప్రభుత్వానికి తల వంచని ఈ మహనీయుడు ఒక విమానంలో రహస్య ప్రదేశానికి వెళ్లినట్లు ఆ విమానం ప్రమాదానికి గురైనట్లు చెబుతారు వాస్తవానికి ఇది ఎంత వరకు నిజమో ఇప్పటికీ తెలియదు.   ఏళ్ల తరబడి రహస్యంగా, వివాదాస్పదంగా ఉన్న ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదానికి సంబంధించిన ఫైళ్లను చెప్పిన మాట ప్రకారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విడుదల చేసింది.


కోల్ కతా పోలీసులు మొత్తం 64 పైళ్లను బహిర్గతం చేశారు. ఇండియన్ హిస్టరీలోనే టాప్ మిస్టరీగా, అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ వివరాలను బహిర్గతం చేశారు. నేతాజీకి సంబంధించి బెంగాల్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న 64 ఫైళ్లను బయటపెట్టారు. ముందుగా నేతాజీ కుటుంబ సభ్యులకు ఆ పత్రాలను అందించిన బెంగాల్ సర్కార్... అనంతరం ప్రజల సందర్శనార్థం కోల్ కోతాలోని పోలీస్ మ్యూజియంలో ఉంచింది. సోమవారం నుంచి ఈ డాక్యుమెంట్లు ప్రజలందరికీ అందుబాటులోకి రానున్నాయి. మొత్తం 12,744 పేజీలున్న 64 ఫైళ్లను డిజిటలైజ్ చేసిన బెంగాల్ ప్రభుత్వం... వాటిని డీవీడీ రూపంలో నేతాజీ ఫ్యామిలీకి అందజేసింది. అన్ని ఫైల్స్ డిజిటలైజ్ చేశాం' అని కోల్ కతా పోలీసు కమిషనర్ సురజిత్ కర్ పర్కాయస్థ అన్నారు.


మహాత్మా గాంధీతో నేతాజీ సుభాష్ చంద్రబోస్


కీళక ఫైళ్లను విడుదల చేస్తున్న సందర్భంగా పలువురు ఆయన కుటుంబ సభ్యులు పోలీసు హెడ్ క్వార్టర్స్కు వచ్చారు. వీరిలో నేతాజీ మేనళ్లుడు కృష్ణ బోస్ భార్య  కూడా ఉన్నారు. అయితే, ఈ ఫైళ్లు విడుదలకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోపాటు ప్రభుత్వ ప్రతినిధులు ఎవ్వరూ కూడా ఈ కార్యక్రమంలో లేకపోవడం గమనార్హం. 1937 నుంచి 1947 మధ్య జరిగిన అంశాలు ఈ పైళ్లలో ఉన్నట్లు సమాచారం. అయితే నేతాజీకి సంబంధించి… కేంద్రం దగ్గర ఉన్న డాక్యుమెంట్లను కూడా బయటపెట్టాలని, అప్పుడే పూర్తి నిజాలు దేశ ప్రజలకు తెలుస్తాయని కుటుంబ సభ్యులు అంటున్నారు.

ట్విట్స్ : 

మరింత సమాచారం తెలుసుకోండి: