తెలంగాణలో టీటీడీపీ నేత ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇంట విషాదం చోటు చేసుకుంది.. ఆయన సోదరుడు కృష్ణారెడ్డి (62) సోమవారం ఉదయం మరణించారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలోని తన నివాసంలో సోమవారం ఉదయం కృష్ణారెడ్డికి గుండెపోటు వచ్చింది. ఆయన్ని కుటుంబ సభ్యులు కల్వకుర్తిలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. . కుటుంబ సభ్యుల కథనం ప్రకారం రోజులానే స్నానం చేసి బయటకు వెళ్లిన కృష్ణారెడ్డి కొద్దిసేపటి తర్వాత ఛాతీలో నొప్పి వస్తోందని ఇంటికి తిరగొచ్చేశారు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు.

చికిత్స చేసేలోపే ఆయన మృతి చెందారు. దీంతో ఆయన మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. కృష్ణారెడ్డి భార్య వనజ గతంలో గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు.  కృష్ణారెడ్డి మృతితో రేవంత్‌రెడ్డి ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అరెస్టైనప్పుడు కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డికి అండగా నిలిచారు. తన అన్నకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.  

రెవంత్ రెడ్డి టీడీపీలో క్రీయశీలక పాత్ర వహిస్తున్న విషయం తెలిసిందే..ఇందుకు ఆయన సోదరుడు వెన్నుదన్నుగా ఉండే వారని ఆయన అకాల మరణం తమను ఎంతో కలిచి వేసిందని పార్టీ వర్గీయులు అంటున్నారు. ఇక కృష్ణారెడ్డి మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు, కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త నారా లోకేశ్ తో పాటు పలువురు తెదేపా నేతలు దిగ్ర్భాంతికి గురయ్యారు.. కృష్ణారెడ్డి కుటుంబసభ్యు లకు తమ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 

నారా లోకేష్ ట్విట్..

మరింత సమాచారం తెలుసుకోండి: