తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి ఇప్పటివరకు రేసులో ఉన్న ఎల్‌. రమణ, రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి మాత్రమే ఉన్నారు. కాని కొత్తగా ఈ జాబితాలోకి ఇపుడు మోత్కుపల్లి కూడా చేరారు. దళితకార్డును ముందు పెట్టి మోత్కుపల్లి ఈ పదవిని చేజిక్కించుకోవాలని చూస్తున్నట్టు తెలిసింది. తెలంగాణ టీడీపీ ఆధిపత్యపోరుపై రోజుకో సమస్య తెలత్తుతోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయంలో ఏంచేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఇది ఆయనకు అగ్నిపరీక్షలా తయారైంది. పార్టీ అధికార పగ్గాలు ఎవరిచేతికి ఇవ్వాలా అన్న దానిపై ఇప్పటికే పలు రకాల చర్చలు జరుగుతున్నా వాటివల్ల ఉపయోగం లేకుండా పోతుంది.

ఆ మద్య ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నేరుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడంపై అధ్యక్ష పదవి ఆయనకే వరిస్తుందమో అన్న అనుమానాలకు తెరలేపింది. ఈ విషయంలో పార్టీలో ఉన్న సీనియర్ నేతలు ఏమాత్రం తమ మద్దతు ఇవ్వలేదు. అందునా ఒకే పార్టీలో ఉన్నా కూడా ఎర్రబెల్లికి.. రేవంత్ రెడ్డికి అంతర్గతంగా మాత్రం వారి మధ్య వివాదాలు ఉన్నాయి.. ఇక అధ్యక్ష ఎన్నిక  ఐవీఆర్ఎస్ పద్దతి ద్వారా కార్యకర్తల నుండి సేకరించిన అభిప్రాయాల గురించి తెలిపారు. అయితే కేవలం 200 మంది నుండే అభిప్రాయాన్ని సేకరించడంతో తెలంగాణలో 2 లక్షల మంది క్రియాశీల సభ్యులున్నారని.. కేవలం 200 మంది అభిప్రాయాలనే ఎలా సేకరిస్తారని అభ్యంతరం వ్యక్త పరిచారు... దీంతో మళ్లీ సమస్య మొదటికి వచ్చింది.    

తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి రేసులో తాను లేనని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు. ఇప్పటికే తాను శాసనసభాపక్షనేతగా ఉన్నానని, అధ్యక్ష పదవికి సీఎం చంద్రబాబు ఎవరిని ఎంపిక చేసినా తన సహకారం ఉంటుందని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎర్రబెల్లి తెలిపారు. దీంతో రేవంత్ రెడ్డికి దారి సుగమం అయ్యిందన్న సమయంలో మోత్కుపల్లి రూపంలో చంద్రబాబుకు మరో సమస్య వచ్చిపడింది.

తెలంగాణ టీడీపీ నేతలు


ఇప్పుడు ఈ రేసులో నేను కూడా ఉన్నాను అంటూ ముందుకొచ్చారు మోత్కుపల్లి. దళితకార్డును ముందుపెట్టి పార్టీ పగ్గాలు చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇప్పుడు టీ టీడీపీలో వేడి వాతావరణం నెలకొంది. దీంతో సమస్య జఠిలం కాక ముందే మీరే తేల్చుకోమన్నట్లుగా బాబు సంకేతాలు పంపించినట్లు తెలుస్తుంది.  ఈ మేరకు సదరు నేత ఆదివారం నేతలందర్ని పిలిచి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంట్లో విందు భోజనం ఏర్పాటు చేసి నచ్చజెప్పేందుకు నానా తంటాలు పడినట్లు తెలుస్తున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: