యెమన్ రాజధాని ముష్కరుల మరోసారి రెచ్చిపోయారు. అక్కడి సనాలోని ఓ మసీదులో గురువారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ  పేలుళ్ల దాటికి సుమారుగా 30 మంది మృతి చెందగా.. మరికొంత మంది తీవ్రగాయాలైనట్టు అధికారులు తెలిపారు.  ముస్లింల పండుగ బక్రీద్ సందర్భంగా అల్-బలిలీ మసీదులో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగిందని తెలిపారు.

ఈ పేలుడు జరిగిన తర్వాత మసీదు నుండి అందరూ బయటికి వస్తుండగా ప్రధాన ద్వారం వద్ద ఆత్మహుతి సభ్యుడు తనను తాను పేల్చుకొన్నాడు. యెమెన్ లో ఇలాంటి దాడులు సర్వ సాధారణంగా మారాయి. ఉగ్రవాదులు తమ పంతం నెగ్గించుకోవడానికి మసీదులపై, విద్యాలయాలపై ఆత్మాహుతి దాడులు నిర్వహిస్తూ ప్రభుత్వానికి సవాలుగా నిలుస్తున్నారు. యెమన్ అధ్యక్షుడు అబ్ ద్రుబ్ మన్‌సూర్ సౌదీ అరేబియాలో రెండు రోజుల పర్యటన అనంతరం తిరిగి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

హౌతీ మిలిటెంట్ల హిట్ లిస్ట్ లో ఉండటంతో మన్ సూర్ మార్చిలో దేశాన్ని వదిలి వెళ్లాడు.యెమన్‌లో గత మార్చి నుంచి కొనసాగుతున్న యుద్ధం కారణంగా సుమారు 4,900 మంది మరణించారని, అందులో 2,200మంది సాధారణ పౌరులు ఉన్నారని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో వెల్లడించింది. ఇలాంటి దాడులు మరిన్ని జరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: