మన దేశం లో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఎలాగో ఇరాన్ దేశం లో బాబక్ ఇంజానీ అంత డబ్బున్నోడు. అతను అపర కుబేరుడుగా ప్రపంచానికి ఎప్పటినుంచో పరిచయం. అలాంటి డబ్బున్న వ్యక్తి కి మరణ శిక్ష ని విధించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ మనోడు ఎంత క్రూరమైన హత్య , మానభంగం చేసాడా అని ఆశ్చర్యపోకండి నిజానికి అతను అలాంటివి ఏమీ చెయ్యలేదు.

 

 

 కేవలం అవినీతి చేసాడు అనే ఆరోపణ మాత్రమే అతని మీద ఉంది దానికే అతన్ని చెంపెయ్యాలి అని డిసైడ్ అయ్యారు. దాదాపు ఇరవై వేల కోట్ల ఆస్తి ఉన్న ఇతగాడు ఆ డబ్బు మొత్తం అక్రమంగా సంపాదించాడు అనే ఆరోపణ ఒచ్చింది అంతే కోర్టు అతని మీద విచారణ జరపి, విచారణ లో ఆరోపణలు మొత్తం రుజువు అవ్వడం తో మరణ శిక్ష విధించింది.

 

 

 

అవినీతి సంపాదన మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేయాలి అని హుకుం కూడా జారీ చేసింది కోర్టు. ఈ వ్యవహారాన్ని మన దేశ పరిస్థితి తో పోల్చి చూస్తే. నాలుగు లక్షల కోట్ల డబ్బు ఎగ్గొట్టిన వీరులు మన దేశం లో ఉన్నారు. అవినీతి కే అక్కడ ఉరిశిక్ష వేస్తే మరి ఇక్కడ అలాంటివి వేస్తే ఎంత మంది ప్రాణాలు లేచిపోతాయో ?


మరింత సమాచారం తెలుసుకోండి: