అదృష్టం బాగుంటే ఎంతటి ప్రమాదం నుంచి అయినా తప్పించుకోవచ్చు అనడానికి తాజా ఘటనే ఉదాహరణ. భూమ్మీద నూకలు ఉంటే చాలు మృతువు దాకా వెళ్లినా త్రిగిరావొచ్చు అంటారు. ముంబైలో జరిగిన ఓ ఘటన ఆ సామెతకు ఉదాహరణే.  ఓ బాలుడు అపార్టుమెంటులోని పరిసర ప్రాంతాల్లో స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ ఆడుకుంటున్నాడు.

ఈ క్రమంలో ఆ బాల్ కార్ పార్కింగ్ స్థలంలో పడింది. ఆ కుర్రాడు బాల్ కోసం పరుగెడుతూ కారు దగ్గరికి వెళ్లాడు.  ఇంతలో తన షూలేస్ ఊడిపోయాయి. అతను కింద కూర్చుని షూలేస్‌ కట్టుకుంటున్నాడు.  అయితే పిల్లాడిని గమనించని ఓ యువతి, కారును స్టార్ట్ చేసి అతనిపై నుంచి పోనిచ్చింది. దీంతో ఆ బాలుడిని కొద్ది దూరం తోసుకెళ్లిన కారు.. అనంతరం అతనిపై నుంచి వెళ్లిపోయింది.

అయితే అదృష్టం కొద్దీ పిల్లాడు కారు మధ్యలోకి జారిపోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.  ఇక ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అదృష్టవశాత్తు బాలుడికి గాయం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: