అనంతపూర్ జిల్లా నియోజకవర్గాల్లో ఉన్న ప్రముఖ నియోజకవర్గాలలో రాయదుర్గం కూడా ఒకటి. గత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. ఆ పార్టీ నేత కాలువ శ్రీనివాసులు తన ప్రత్యర్థి అయిన టీడీపీ నేత కాపు రామచంద్ర రెడ్డి పై విజయం సాధించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా స్థానం సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి గెలిచి సత్తా చాటాలని కాలువ భావిస్తుండగా 2009 సాధారణ ఎన్నికలతో పాటు 2012 ఉపఎన్నికల్లో విజయం సాధించి గత ఎన్నికల్లో ఓడిన కాపు తిరిగి పట్టు సాధించాలని చూస్తున్నారు.

దీంతో ఇక్కడ ఆసక్తికర పోరు జరగనుంది. రాయదుర్గం నియోజకవర్గం 1955 లో ఏర్పడింది. అప్పటినుంచి ఇక్కడ పద్నాలుగు సార్లు ఎన్నికలు జరుగగా అటు అధికారికంగా కాంగ్రెసు ఎనిమిది సార్లు విజయం సాధించింది. మూడు సార్లు టీడీపీ, రెండు సార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. 2012 లో జరిగిన ఉపఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది. 1955 లో శేషాద్రి ఇక్కడి నుండి తొలి ఎమ్మెల్యేగా గెలిచారు. రాయదుర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తుంది. ఇక్కడ టీడీపీ 1994 లో తొలిసారిగా విజయం సాధించింది. ఆ తర్వాత ఒక్కసారి, మరోసారి గెలుస్తూ వస్తుంది. 1999 లో అనంతపురం ఎంపీగా పోటీ చేసిన శ్రీనివాసులు ఆ తరవాత 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. 2014 లో రాయదుర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.

మరోసారి గెలవాలని భావిస్తున్నారు. అయితే ఈసారి అనంతపురంలో అత్యధిక స్థానాలు గెలవాలని భావిస్తున్న వైసీపీ రాయదుర్గం లో గెలుపు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీడీపీ నేత శ్రీనివాసులు నియోజకవర్గానికి చేసింది ఏమి లేదని అతని వైఫల్యాలు తమకు లాభిస్తాయి అని వైసీపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే ఇరు పార్టీల నుండి అభ్యర్థులను ఖరారు చేసారు. టీడీపీ నుంచి కాలువ శ్రీనివాసులు పోటీ చేయగా వైసీపీ నుంచి కాపు రామచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే అనంతపురం జిల్లాలో బలంగా ఉన్న పార్టీ జనసేన కూడా ఇక్కడి నుంచి పోటీకి దిగితే పోటీ రసత్తరంగా సాగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: