అమెరికా పాక్ తో ఆయుధాల వ్యాపారం చేసిందే కాని, వాటి గుట్టు తన గుప్పెట్లోనే ఉంచుకుందని తెలుస్తుంది. అమ్రామ్‌ క్షిపణుల సూపర్‌వైజరీ కంట్రోల్‌ అండ్‌ డేటా అక్విజేషన్‌ వ్యవస్థ — ఎస్‌సీఏడీఏ"  తన చెప్పు చేతల్లో ఉంచుకునే ఎఫ్-16 యుద్ధ విమానాలను సైతం పాక్ కు విక్రయించింది. దేశం లోపల ఉగ్రవాద కార్యక్రమాలను నిరోదించాలనే ఉద్దేశంతో ఇవి పాక్ కు సరపరా చేయబడ్డాయి.కాని భారత్ లాంటి దేశాలపై దాడి చేయటానికి కాదని సరపరా సమయంలోనే అమెరికా పాక్ కు స్పష్టం చేసింది. 

Image result for amraam missile f 16

పాక్‌ వద్ద ఉన్న అత్యాధునిక "అమ్రామ్‌ క్షిపణులు" ను బయట దేశాల నుండే నిర్వీర్యం చేయవచ్చు. అమెరికా వద్ద భారత లాబీయింగ్‌ ఫలించి ఇది సాధ్యమైంది. గత నెల లో "నౌషెరా సెక్టార్‌" లోకి పాక్‌ ఎఫ్‌16 యుద్ధ విమానాలు చొచ్చుకొని వచ్చి కొన్ని క్షిపణులను ప్రయోగించి భారత వాయుసేన తరమి కొట్టడంతో తిరిగి పాక్‌ భూభాగం లోకి వెళ్లి పోయాయి.


పాక్‌ ఈ దాడిలో ఎఫ్‌-16 యుద్ధ విమానాలను వాడలేదని ఎన్ని ఆధారాలు చూపినా ఒప్పుకోవడం లేదు. చివరికి భారత్‌ ఎఫ్‌-16 ద్వారా ప్రయోగించే అమ్రామ్‌ క్షిపణుల శకలాలను చూపింది  అప్పుడు కూడా తొలుత పాక్ అవి థాయిలాండ్‌ కు చెందినవని బుకాయించింది. కానీ భారత్‌ బ్యాచ్‌ నెంబర్ల తో సహా చూపింది. ఒక వేళ పాక్‌ చైనాకు చెందిన జే-17 యుద్ధ విమానాలను దాడికి వాడితే మరి అమెరికాకు చెందిన అమ్రామ్‌ క్షిపణుల శకలాలు ఎలా వచ్చాయి.

Image result for amraam missile f 16

అమెరికా క్షిపణులను చైనా విమానాలకు అమర్చి ప్రయోగించిందా! వాటిని ప్రయోగించే వ్యవస్థ చైనాకు ఎలా వచ్చింది! అనే అనుమానాలకు పాక్‌ సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఈ రకంగా పాక్‌ ఇరుక్కుపోయింది.


సాధారణంగా ఏ దేశమైనా ప్రత్యర్థిపై దాడి చేస్తే ఘనంగా ఆయుధ వివరాలతో సహా గర్వంగా చెప్పుకొంటుంది. పాక్‌ మాత్రం అన్నీ దాచిపెడుతోంది. దీనికి కారణం అమెరికా ఇచ్చిన యుద్ధ విమానాలను పాక్ లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు మాత్రమే వాడాలి. కానీ ఇలా మరో దేశంపై దాడికి వాడకూడదు. పాక్‌కు ఈ క్షిపణుల ను, ఎఫ్‌-16 విమానాలను సరఫరా చేయడంపై 2015 లో అమెరికా అధికారులతో జరిగిన ఒక సమావేశంలో అప్పటి భారత్‌ రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌ తీవ్ర అభ్యంత రాలు వ్యక్తం చేశారు. అప్పట్లో అమెరికా రక్షణ వర్గాలు దీనిపై స్పందించాయి. "అమ్రామ్‌ క్షిపణులు" వినియోగాన్ని పర్యవేక్షించే వ్యవస్థ అమెరికాకు ఉంది. ఒక వేళ పాక్‌ పొరుగు దేశంపై వీటిని వాడితే ఆ  పర్యవేక్షక వ్యవస్థ సాయంతో క్షిపణులను నిర్వీర్యం చేయవచ్చని నాటి అమెరికా మంత్రి హోదా లో ఉన్న రక్షణశాఖ కార్యదర్శి "ఆస్టన్‌ కార్టర్‌" వెల్లడించారు.

Related image

అమెరికా తలుచు కుంటే ఆ దేశ క్షిపణులు పనిచేయవు! అమెరికా పాక్ తో ఆయుధాల వ్యాపారం చేసిందే కాని, వాటి గుట్టు తన గుప్పెట్లోనే ఉంచుకుందని తెలుస్తుంది.  గతంలో మనోహర్ పారికర్‌కు వెల్లడించిన అమెరికా

austion carter with parrikar కోసం చిత్ర ఫలితం

ఇక ఎఫ్‌-16 లకు అణుబాంబులను సైతం ప్రయోగించే సామర్థ్యం ఉంది. ఒక వేళ వీటిని కూడా భారత్‌ కు వ్యతిరేకంగా వాడాలని అనుకుంటే ఆ యుద్ధ విమానాలను నిర్వీర్యం చేసే వ్యవస్థను అమెరికా పర్యవేక్షణ నియంత్రణ లో ఉందని కార్టర్‌ పేర్కొన్నారు.  


పాక్‌కు 8 సరికొత్త ఎఫ్‌-16 యుద్ధవిమానాల సరఫరాను 2015లో భారత్‌ అడ్డుకొంది. భారత్‌ కు చెందిన లాబీయింగ్‌ వ్యవస్థ అమెరికా సెనెట్‌ లో బలంగా పనిచేసి పాక్‌ యుద్ద విమానాల సరఫరాను ఘట్టిగానే సెనెట్‌ లో వ్యతిరేకించింది. అమెరికా ప్రజల పన్నుల సొమ్ముతో పాక్‌ లాంటి ఉగ్రవాద దేశానికి విమానాలను అందజేయడానికి సెనెట్‌ అంగీకరించలేదు.

 austion carter with parrikar కోసం చిత్ర ఫలితం

"స్టక్స్‌నెట్‌" అనే ఒక కంప్యూటర్‌ వార్మ్‌ (వైరస్‌ వంటిది) ఉనికి తొలిసారి 2010 లో బయట పడింది. ఇది ముఖ్యంగా కీలకమైన  "సూపర్‌వైజరీ కంట్రోల్‌ అండ్‌ డేటా అక్విజేషన్‌ వ్యవస్థ ఎస్‌సీఏడీఏ"  లపై పని చేస్తుంది. 2005 నుంచి దీనిని అగ్రరాజ్యం అమెరికాలో రహస్యంగా అభివృద్ధి చేశారు. కంప్యూటర్లలోని ప్రోగ్రాం లాజిక్‌ పై ఇది పని చేస్తుంది. ఆటోమేషన్‌ వ్యవస్థలను ధ్వంసం చేస్తుంది.

Image result for stun network

సాధారణంగా యురేనియం శుద్ధి చేసే వ్యవస్థల్లో ఇటువంటివి ఆటోమేషన్‌ వ్యవస్థలు ఉంటాయి. వీటిని స్టక్స్‌నెట్‌ ఘోరంగా దెబ్బ తీస్తుంది. 2010 లో ప్రపంచ వ్యాప్తంగా స్టక్స్‌నెట్‌ వార్మ్ వ్యాపించింది. ఆ కాలంలోనే ఇరాన్‌ లోని యురేనియం శుద్ధి కార్యక్రమంలో భాగస్వాములైన ఐదు కంపెనీలు దీని బారిన పడ్డాయి. అప్పట్లో తమ వ్యవస్థ లకు ఏమీ కాలేదని ఇరాన్‌ బుకాయించింది.

Image result for amraam missile f 16

కానీ 2011 లో శ్వేతసౌధంలోని గ్యారీ సమార్స్‌ మాట్లాడుతూ "మేము విజయవంతంగా ఇరాన్‌ యరేనియం శుద్ధి కార్యక్రమంలో సమస్యలు సృష్టించాం" అని వెల్లడించారు. కంప్యూటర్‌ ప్రపంచంపై అమెరికాకు ఉన్నపట్టును ఎవరూ కాదనలేరు. ఈ నేపథ్యంలో పాక్‌ వద్ద ఉన్న అమెరికా ఆయుధాలను నిర్వీర్యం చేయడం ఆ దేశానికి చాలా తేలికై న పని. ఇప్పుడు పాక్‌ శక్తంతా అమెరికా పిడికిలో ఉండటంతో పాక్ భయపడి పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: