మరి కొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో కొన్ని ఫేక్ సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికే చాలా సర్వేలు బయటికి వచ్చాయి కానీ ఇది మాత్రం పక్కా ఫేక్ సర్వే అని తెలిసిపోతుంది. ఇప్పటికే జాతీయ సర్వేలు వైస్సార్సీపీదే విజయమని చెబుతున్నాయి. పాదయాత్ర ద్వారా జగన్ ప్రజలకు మరింత చేరువయ్యారు. 2014 తో పోలిస్తే ఓట్ల శాతం, సీట్లు పెరిగే దానికి అవకాశం ఉంటుంది కానీ మరి సీట్లు తగ్గేపోయే అవకాశం లేదు. 

Image result for jagan

ఈ ఫేక్ సర్వే ఎవరు తయారు చేసారో కానీ టీడీపీకి 45.8 % మరియు వైస్సార్సీపీకి 37.6 % జనసేనకు 12.5 % అని చెబుతున్నాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే జగన్ పార్టీ కి 2014 లో వచ్చిన శాతం కంటే తగ్గిపోవడమే. అలాగే టీడీపీ కి 126 సీట్లు , వైస్సార్సీపీ కి 39 మరియు జనసేనకు 10 సీట్లు . ఈ సర్వే చూస్తుంటే పచ్చ మీడియా లేదా పచ్చ బ్యాచ్ వదిలిన సర్వే అనిపించకమానదు. అయితే సర్వేలు ఎవరైనా చేయొచ్చు. 


కానీ మరి ఇంత ఘోరంగా ప్రజలు నమ్ముతారో లేదో అని తెలుసుకోకుండా వదిలేస్తున్నారు. అయితే 2019 ఎన్నికలో ఎవరైనా గెలవచ్చు. కానీ ప్రతిపక్షంలో జగన్ కు మాత్రం ఈ సరి ఓట్ల శాతం కానీ, సీట్లు ఘననీయంగా పెరుగుతాయని చెప్పటంలో ఎటువంటి అతిశయెక్తి లేదు. అయితే తెలంగాణలో కూడా ఇటువంటి సర్వే ఒకటి హల్ చల్ చేసింది. కానీ చివరికి ఏమైంది కెసిఆర్ ఘనంగా గెలిచాడు. ప్రజలు ఇటువంటి సర్వేలతో తస్మాత్ జాగ్రత్త ..!


మరింత సమాచారం తెలుసుకోండి: