2019 ఎలక్షన్ అద్భుతంగా సాగుతోంది . ఎలక్షన్ కమీషన్ చాలా ముందుగానే ఎలక్షన్ ని ప్రకటించినా కూడా ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వేడి చాలా త్వరగానే రాజుకుంది. ప్రస్తుతం వైకాపా vs టీడీపీ గా నడుస్తున్న ఎన్నికల్లో జనసేన పార్టీ ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది అనేది ఆసక్తికరమైన అంశం.


ఈ మధ్య కాలం లో జనసేన - టీడీపీ కి Subset పార్టీ అనే మాట వినపడింది. పవన్ కళ్యాణ్ గత 2014 ఎన్నికల్లో టీడీపీ కి సపోర్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే .. అయితే పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నాడు ఒక పక్క ఎప్పుడూ పొత్తులతో ముందుకు వెళ్ళే టీడీపీ కూడా పొత్తులు లేకుండా ఒంటరిగా వెళుతోంది.



ఇలాంటి పరిస్థితి లో టీడీపీ - వైకపా మధ్య ఖచ్చితంగా అవగాహన ఉంది అనేది వైకాపా ప్రధాన ఆరోపణ. దానికి ఊతం ఇస్తూ పవన్ కళ్యాణ్ - చంద్రబాబు ల ప్రవర్తన కూడా అలాగే ఉంది. జగన్ మీద అరవడం , ఆవేశం ప్రదర్శించడం తప్ప చంద్రబాబు మీద పవన్ ఎప్పుడూ గట్టిగా వ్యాఖ్యలు చెయ్యడం లేదు .


ఇప్పుడు చంద్రబాబు కూడా అదే తరహాలో పవన్ కళ్యాణ్ గురించి మెత్తగానే మాట్లాడుతున్నారు తప్ప ఎలక్షన్ స్టైల్ లో వ్యాఖ్యలు వినపడడం లేదు . పాపం బాబోరు కి పవన్ మీద అంత లవ్ ఏంటో అని జనం విషయం క్లియర్ గా అర్ధం చేసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: