కృష్ణ జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో మచిలీపట్నం ఒకటి. జిల్లా కేంద్రమైన ఇక్కడి నుండి టీడీపీ నేత కొల్లు రవీంద్ర ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన వైసీపీ నేత పేర్ని వెంకట్రామయ్య పై గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. మరోసారి గెలిచి సత్తచాటలని రవీంద్ర ఉండగా, గత ఎన్నికల పరాజయానికి బదులు తీర్చుకోవాలని పేర్ని నాని భావిస్తున్నారు. 1952 మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది.


పలువురు ప్రముఖులు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. అయితే 2008 పునర్విభజనలో ఈ సెగ్మెంట్ కొంత రూపు మార్చుకుంది. విభజన తర్వాత 2009 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య టీడీపీ నుంచి పోటీ చేసిన కొల్లు రవీంద్ర పై విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ వీరిద్దరే పోటీ పడగా ఫలితం మాత్రం మారింది. పేర్ని వెంకట్రామయ్య వైసీపీ నుంచి పోటీ చేయగా టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర  విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా కేబినెట్ బెర్త్ దక్కించుకున్నారు. మరోసారి విజయం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. మాజీ మంత్రి నరసింహారావు అల్లుడిగా రాజకీయ అరంగేట్రం చేసారు కొల్లు రవీంద్ర.


తొలి ప్రయత్నంలో ఓటమి చవిచూసిన ఆయన రెండోసారి విజయం సాధించారు. ఇక పునర్విభజన తర్వతా పోటీ చేసి గెలిచిన పేర్ని వెంకట్రామయ్య గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కొల్లు రవీంద్ర పాలనతో ప్రజలు సంతృప్తిగా లేరని ఈసారి తనకు ఓటమి తప్పదని అంటున్నారు. అయితే పేర్ని వెంకట్రామయ్య తన వ్యక్తిగత చరిత్ర, ప్రభుత్వ వ్యతిరేకతలే తన విజయానికి మెట్లనీ అంటున్నారు. ఇక్కడ ఇంకా బలమైన క్యాడర్ ఉన్న పార్టీ జనసేన. 2009 లో పీఆర్పీ పార్టీ ఇక్కడ గణనీయమైన ఓటలు సంపాదించింది. ఆ ప్రభావం కలిసిరావడం కాక ఇక్కడ పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ ఆయన చరిష్మా విజయానికి సోపానాలు వేస్తాయి. ఇప్పటికే పార్టీ అభ్యర్థులు ప్రకటించేశారు. అటు టీడీపీ నుంచి ఇటు వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ పడిన ఇద్దరే ఈసారి తలపడనున్నారు. అయితే జనసేన పార్టీ నుంచి బండి రామకృష్ణ పోటీ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: